Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ఎస్సీల అభివృధ్దే ప్రభుత్వ ధ్యేయంగా దళిత కాంతి పథకం చేపట్టినట్లు రాష్ట్ర గిరిజన, మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలి పారు. గురువారం జూలై 1 నుండి 10వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి పుర స్కరించుకొని 29వ వార్డ్‌లో కార్య్రక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ మొదటి సభలను దళితవాడ లతోనే ప్రారం భించాలన్న ముఖ్యమంత్రి సంకల్పం పట్టణ ప్రకృతితో నెరవేరిందన్నారు. దళితుల సమస్యలను అంచలం చలుగా పరిష్కరిస్తామన్నారు. రూ.50 కోట్లతో ముని సిపాలిటీ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.5 కోట్లతో మోడల్ మార్కెట్ శంకుస్థాపన చేశా మన్నారు.దళితవాడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా మని అన్నారు. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం తదితరవి మెరుగు పడేలా చూస్తా మన్నారు. రూ.వెయ్యి కోట్లతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శ్రీకారం చుట్టారన్నారు. పైలెట్ ప్రాజెక్టుతో కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేసి ప్రతి దళిత కుటుంబం అభివృద్ధి పథంలో కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ జనాభా సుమారు ఐదు నుండి ఆరు లక్షలమంది ఉంటారని అంచనా వేశామని, దళితులకు రుణాలు మంజూరు చేసి జేసీబీ వంటి పరికరాలు మంజూరు చేస్తామన్నారు. అర్హులకు సెప్టిక్ ట్యాంక్ క్లీనర్లు మంజూరు చేస్తామన్నారు. దళితులకి రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేసేందుకే పట్టణంలో 400 ఇండ్ల నిర్మాణం చేపట్టా మని తెలిపారు. ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఇండ్లు మంజూరు చేసేలాచర్యలు తీసుకుంటామన్నారు. తండాలు కూడా అభివృద్ధి పరుస్తామన్నారు. మంత్రి రూ.5లక్షలు మంజూరు చేయగా కలెక్టర్ మరో రూ.5లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. దళితవాడలో లోని ప్రతి ఇంటి సమాచారం సమగ్రంగా సేకరించాలని, నివాస స్థలాలపై హక్కు కల్పించాలని ఆదేశించారు. 6వేలమందికి రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పింఛన్లకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మెన్ రామ్మోహన్ రెడ్డి వైస్ చైర్మెన్ ఫరీద్, మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి, తాసిల్దార్ రంజిత్, సోమయ్య, హర్షికరావిష్ పాల్గొన్నారు.
మోడల్ మార్కెట్‌కు మంత్రి శంకుస్థాపన
మహబూబాబాద్ పట్టణంలో రూ.4.50 కోట్లతో నిర్మించనున్న మోడల్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌కు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. గురువారం మహబూబాబాద్ పాత కూరగాయల మార్కెట్ స్థలంలో కొత్త మార్కెట్ కు శంకుస్థాపన అనంతరం ఆమె మాట్లాడారు. పటణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా వెజిటేరియన్ నాన్ వెజ్ సీరియల్ మార్కెట్ నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామన్నారు. రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలన్నారు. 33వ వార్డ్ కౌన్సిలర్ గోపి రత్నం, మారి నేను రఘు పాల్గొన్నారు.