Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
నవతెలంగాణ-మహబూబాబాద్
రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల సహకారంతో మానుకోట పట్టణాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తెలిపారు. గురువారం డాక్టర్స్ డే, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సీతామహాలక్ష్మి దంపతుల 27వ వివాహ వార్షికో త్సవం సందర్భంగా నిర్వహించిన సన్మాన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. మానుకోట రూపు రేఖలు మారుతున్నాయని రాబోయే కొద్దికాలంలోనే మాహబూబాబాద్ పట్టణం సుందరంగా కాబోతుందని, ప్రజలు సహకరించాలని కోరారు. ఒక్క వ్యాపారి కూడా రోడ్డున పడకుండా వ్యాపా రాలు నిర్వహించుకునేలా కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో మానుకోటను అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మి శంకర్‌నాయక్ దంపతులను 23వ వార్డు కౌన్సిలర్ మార్నేని శ్రీదేవిరఘు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. రక్షిత ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ కీర్తిని సన్మానించారు. మున్సిపల్ చైర్మెన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మెన్ ఫరీద్, బోనగిరి గంగాధర్, సలీమ్, చిట్యాల జనార్దన్, ఎడ్ల వేణు, బాలు, గద్దె రవి, గోగుల రాజు, రాజశేఖర్, మర్నేని రఘు, యాళ్ల మురళీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.