Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రాహ్మణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల ఆధీనంలో ఉన్న లక్ష ఇరవైవేల ఎకరాల భూములను కాపాడాలని బ్రాహ్మణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేందర్ శర్మ కోరారు. గురువారం డాక్టర్స్ డేను పురస్కరించుకొని బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వింజమూరి సుధాకర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన అర్చక సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో 35వేలఎకరాల40గుంటల దేవాలయ భూములు ఆక్రమణ లకు గురయ్యాయని అన్నారు. ఈ భూములను ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా కొనుగోలు చేసి అట్టి ఆదాయాన్ని దేవాలయాలకు కేటాయించాలన్నారు. మిగిలిన 85 వేల ఎకరాల భూములను హైకోర్టు అనుమతితో విక్రయించి దేవాలయాల అభివృద్ధికి, పేద అర్చకులకు వినియోగించా లని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 12625 దేవాలయాల్లో అర్చకులు, సిబ్బందికి వేతనాల్లు పెంచాలన్నారు. రాష్ట్రంలో పేద బ్రాహ్మణులను ఆదుకోవడానికి రూ.165కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇప్పటికే తొర్రూరు మహబూబాబాద్ ప్రాంతాల్లో పేద బ్రాహ్మణులకు యాభై లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశామన్నారు. విదేశాల్లోని పేద బ్రాహ్మణ పిల్లలకు రూ.20 లక్షలు అందజేస్తామని అన్నారు. పేద వృద్ధ బ్రాహ్మణులకు నెలకు రూ.3వేల పింఛను అందజేస్తున్నామన్నారు. పేద బ్రాహ్మణుల పిల్లల అభివృద్ధికి రూ.140కోట్లతో అర్చక వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నా మన్నారు. 225 మంది బ్రాహ్మణులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశామన్నారు. సంవత్సరానికి రెండు లక్షల 10 వేల రూపాయల చొప్పున అందజేస్తామన్నారు. కరోనా సమయంలో డాక్టర్ల సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నవీన్ శర్మ, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు రమేష్ శర్మ, జనగామ జిల్లా అధ్యక్షులు శ్రావణ్ శర్మ, బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు, ఓసీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు బ్రాహ్మణులు పాల్గొన్నారు.