Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ములుగు
కరోనా కట్టడిలో ప్రధాన భూమిక వైద్యులదే నని, కనిపించే దేవుళ్ళు వైద్యులు అని జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ కొనియాడారు. కరోనా నిర్మూల నలో ములుగు జిల్లా వైద్యులవి అద్భుత సేవలని అన్నారు. గురువారం ములుగు ఏరియా ఆస్పత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా వైద్యులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జగదీశ్వర్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో వైద్య సిబ్బంది సేవలు అందించటం గొప్ప విషయమన్నారు. వైద్యుల సేవాతత్పరతకు పాదాభివందనమని అన్నారు. వైద్యులు అప్పయ్య, జెగదిష్, గౌతం, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజరురామ్నాయక్, జిల్లా మైనారిటీ సెల్ తహర్ పాష, సురేష్ పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం
ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా గురువారం ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్‌ను జిల్లా ఎస్పీ కార్యాలయంలో సన్మానించారు. ములుగు ఏరియా హాస్పిటల్ లోని వైద్యులందరిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎంహెచ్ఓ అప్పయ్య, ములుగు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జగదీష్, టీబీ లెప్రసి ఎయిడ్స్ వ్యాదుల జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ పోరిక రవీందర్, డాక్టర్ సి నారాయణరెడ్డి, డాక్టర్ గౌతమ్ చౌహాన్, డాక్టర్ ప్రశాంత్ నాయక్, డాక్టర్ సునీత , డాక్టర్ సుష్మను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ డాక్టర్ వత్తి ఎంతో పవిత్రమైనదని బాధ్యతతో కూడిన దని అన్నారు. కరోనా సమయంలో వైద్యులందరూ విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించారని అన్నారు. తనతోపాటు వైద్యులందరిని సన్మానించడం ఆనం దంగా ఉందన్నారు. ములుగు ఏరియా సూపరిం టెండెంట్ జగదీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ములుగు లయన్స్ క్లబ్ వారు డాక్టర్ డే సందర్భంగా తమను సన్మానించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం లైన్స్ క్లబ్ సభ్యులను ప్రశంసించారు. ములుగు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానికొమ్ము రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ చుంచు రమేష్, కార్యదర్శి కొండి సాంబశివ, కోశాధికారి ముక్కు సుబ్బారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.