Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో పునరేకీకరణకు టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి టీమ్ కసరత్తు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత శాసనసభ ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ సుప్తచేతనావస్థలో ఉన్న ఉంది. టీడీపీలో రేవంత్‌రెడ్డి కొనసాగిన క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. తాజా రాజకీయాల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే అవకాశాలున్నాయి. 'రేవంత్'కు గట్టి మద్దతుదారులుగా ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తదితరుల బృందం కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ఒకటి, రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలను సైతం కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. టిడిపిలో బలమైన నేతలుగా ఉన్న నాయకులను సైతం కాంగ్రెస్‌లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన భూపాలపల్లి నియోజకవర్గం ఏఐఎఫ్బీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావును కాంగ్రెస్‌లో చేర్చుకునే అవకాశముంది. ఇదే క్రమంలో మరికొందరు నేతలు, టీఆర్ఎస్లోని అసంతృప్త నాయకులపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పునరేకీకరణకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టీమ్ రంగం సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్‌రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ నేతలతో సన్నిహిత సంబం ధాలున్నాయి. టీటీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి, ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నడుమ విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ క్రమంలో 'ఎర్రబెల్లి' టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. అనంతర పరిణామాల్లో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. మల్కాజ్గిరి ఎంపీగా విజయం సాధించిన అనంతరం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవికి పోటీపడుతూ వచ్చారు. అన్ని అభ్యంతరాలను అధిగమించి ఎట్టకేలకు టీపీసీసీ అధ్యక్షుడుగా ఈనెల 7న బాధ్యతలు స్వీకరించనున్నారు. 'రేవంత్'కు జిల్లాకు చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి అత్యంత సన్ని హితులు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగులో సీతక్క మాత్రమే గెలిచారు. వీరిలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో ఏఐఎఫ్బీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణరావు సరైన అవకాశం రాకపోవడంతో ఏ రాజకీయ పార్టీలో చేరకుండా ఉండిపోయారు. రేవంత్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలుండడంతో కాంగ్రెస్‌లో గండ్ర సత్తన్న చేరే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉండడం తనకు భూపాలపల్లిలో లైన్ క్లియర్ కావడానికి అవకాశాలు మెరుగయ్యాయని గండ్ర సత్తన్న భావిస్తే కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. మరికొద్ది రోజుల్లో గండ్ర సత్తన్న స్పష్టతనిచ్చే అవకాశం లేకపోలేదు. ఆయన కాంగ్రెస్‌లో చేరితే నియోజకవర్గంలో ఆ పార్టీ బలపడే అవకాశముంది.
కాంగ్రెస్ పునరేకీకరణకు మార్గం..
కాంగ్రెస్ బలహీనపడిన నేపథ్యంలో పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్లిన నేతలను 'ఘర్ వాపసీ' ద్వారా కాంగ్రెస్‌లో చేర్చుకునే కార్యక్రమాన్ని రేవంత్ బృందం ముందుగా అమలు చేస్తుందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరిని గెలిపించినా వారంతా టీఆర్ఎస్లో చేరిపోవడంతో కాంగ్రెస్‌పై ప్రజలు నమ్మకం కోల్పోయారు. ఈ దశలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక పార్టీ కేడర్‌లో, ప్రజల్లో నమ్మకం కలిగించే చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ, టీఆర్ఎస్లకు వెళ్లిన నేతలను తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి రేవంత్ టీమ్ సన్నద్ధమవుతోంది.
'ఘర్ వాపసీ' అమలుకు శ్రీకారం
కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో, కేడర్‌లో విశ్వాసం కలిగించేలా చర్యలు చేపట్ట డానికి రేవంత్‌రెడ్డి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన అనుచరులు చెబు తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నేతలతోపాటు టీడీపీ నాయకులపై స్పెషల్ ఫోకస్ పెట్ట నున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యేను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ, టీడీపీల నుంచే కాకుండా అధికార టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న నేతలను సైతం కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని పక్కా స్కెచ్‌తో 'రేవంత్' టీమ్ ముందుకు సాగుతోంది.