Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్
నవతెలంగాణ-నెల్లికుదురు
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల రూపురేఖలు మారేలా చర్యలు చేపట్టాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండలంలోని లక్ష్మీపురం, హనుమాన్ నగర్ తండా గ్రామాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఆయా గ్రామాల్లో చేపట్టి గ్రామ అభివృద్ధి చెందేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. లక్ష్మీపురంలో వీధుల గుండా వచ్చే నీరు ప్రధాన రహదారిపై ఆగడంతో బురదమయంగా ఏర్పడిం దని ప్రజలు తెలపడంతో వెంటనే స్పందించిన అదనపు కలెక్టర్ బురద మడుగులో మొరం పోయించి క్రషర్లో వచ్చే సన్న పొడిని కలిపి పోస్తే బురదను తొలగించవచ్చని సర్పంచ్‌కు సూచించారు. హనుమాన్ నగర్ తండాను సందర్శించి గ్రామంలోని అన్ని వీధులు తిరిగి అక్కడ గ్రామాల్లోని ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వార్డు సభ్యుల పరిధిలో సమస్యలు ఎలా ఉన్నాయని తెలుసు కున్నారు. సర్పంచ్ గుగులోతు శారద గ్రామాభివద్ధి పట్టించుకోవడం ప్రజలు తెలపడం తో అదనపు కలెక్టర్ అభిలాష్ స్పందించారు. సర్పంచ్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, ఎంపీడీఓ వేణు గోపాల్‌రెడ్డి, ఎంపీఓ బండారి పార్థసారధి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నారాయణరెడ్డి, శారద, ఆయ్ష్షా గ్రామాల పంచాయతీ నరేష్ ప్రియాంక విద్యుత్ సిబ్బంది వస్త్రర సిబ్బంది అంగన్వాడి టీచర్లు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.