Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.5 కోట్లతో సమీకృత మార్కెట్
- పట్టణ ప్రతి కార్యక్రమానికి రూ.80 లక్షలు మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-భూపాలపల్లి
పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల్లో జిల్లాను ఆదర్శంగా నిలపాలని రాష్ట్ర గిరిజన,మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భూపాల పల్లి పట్టణంలోని 24, 25 వారుల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి మంత్రి పర్యటించి మొక్కలు నాటారు. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లా డారు. జులై 1 నుండి 10వ తేదీ వరకు పది రోజుల పాటు పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలను నిర్వహించి గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అధికా రులు, ప్రజా ప్రతినిధులు ఇంటింటికి తిరిగి సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. భూపాల పల్లి మున్సిపాలిటీకి పట్టణప్రగతి ద్వారా రూ.80 లక్షలు మంజూరు చేశామన్నారు. ప్రతి నెల రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు రూ.148 కోట్లు, 12769 గ్రామపంచా యతీలకు రూ.369 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తున్నదని అన్నారు. అడిషనల్ కలెక్టర్కు రూ.25 లక్షలు, కలెక్టర్ కు రూ.కోటి, మంత్రులకు రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించారని అన్నారు. పట్టణంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, ప్రతి ఇంటికి 6 మొక్కలు అందించి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అభివృద్ధిలో ముందు స్థానంలో నిలిచే వార్డుకు తన నిధుల నుండి రూ.10 లక్షలు బహుమానంగా అందిస్తానని అన్నారు. రెండు, మూడు స్థానాల్లో నిలిచే వార్డులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తానన్నారు. భూపాలపల్లి పట్టణంలో రూ.5 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఆస్పత్రిలో ఇప్పటికే 30 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం, కోవిడ్ చికిత్స అందిస్తున్నామన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఆస్పత్రిని ప్రారంభించుకునేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య పరికరాల కొనుగోలు పూర్తి చేస్తామన్నారు. దళితుల అభివృద్ధికి దళిత క్రాంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిం దన్నారు. అనంతరం వరంగల్ ఎంపీ దయాకర్ మాట్లాడు తూ... 70ఏండ్లుగా ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి దళిత సాధికారత పథకం ద్వారా రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని త్వరలో అందించనుందని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ... ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి వైద్యుల నియామకం ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టు లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి మిగులు ధాన్యాన్ని పండించి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎందే నని అన్నారు. భూపాలపల్లి పట్టణంలో మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటానని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ... భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక అధికారులను వార్డుల వారీగా నియమించి పనులను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పచ్చ దనం పరిశుభ్రతకు కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ నేతృత్వంలో పర్యవేక్షణ ఉంటుందన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ షెగ్గం వెంకటరాణి మాట్లాడుతూ.. పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులతో ప్రణాళికాబద్ధంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను కౌన్సిలర్, అధికారుల సహకారంతో చేపట్టినట్టు వివరిం చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తాసిల్దార్ ఇక్బాల్, స్థానిక వార్డు కౌన్సిలర్లు శిరుప అనిల్, సజ్జనపు స్వామి, రవీందర్ గౌడ్ పానుగంటి హారిక, మౌనిక, మేకల రజిత, సింగిల్ పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్కుమార, నాయకులు బుర్ర రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులు అన్ని విభాగాల్లో రాణించాలి
ఈ నెల 23వ తేదీన టోక్యో మహానగరంలో ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న సందర్భంగా దేశం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు, నిర్వాహకులకు మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్రీడాకారులను అభినందించారు. ఒలింపిక్స్ క్రీడాకారులు అన్ని విభాగాల్లో రాణించి దేశానికి అత్యధిక బంగారు పతకాలు సాధించి ముందంజలో ఉంచాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సేగ్గెం వెంకటరాణి సిద్దు, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి బుర్ర సునీత రమేష్, క్రీడాకారులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.