Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం సాయిబాబు
నవతెలంగాణ-హన్మకొండ
కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకుండా డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి దోచుకుంటు న్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం సాయిబాబు విమర్శించారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం చుక్కయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి పేదలపై పెనుభారం మోపిందన్నారు. కరోనాతో ప్రజలు పనులు లేక, ఉన్న ఉద్యోగాలు పోయి ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాద కార్పొరేట్ శక్తులకు బీజేపీ కొమ్ము కాస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో మాత్రం బీజేపీ నాయకులు వాస్తవాలను మరుగున పెట్టి అబద్ధాలని ఆయుధాలుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల బతుకులు మారుతాయని చెప్పిన కేసీఆర్ ప్రజల బతు కులను మార్చలేక పోయారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రజల బతుకులు ఎలా ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ప్రజల బతుకులు అలాగే ఉన్నాయన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్అర్బన్ జిల్లాలో ఒక్క దళితునికి కూడా సెంటు భూమి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఒక్క కుటుంబానికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదన్నారు. వరంగల్ నగరంలో గడిచిన ఆరేళ్లలో నగరాభివద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాల న్నారు. ప్రభుత్వ భూములలో ఇల్లు లేని నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఇవ్వలేదని, 200 మురికివాడల అభివద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. వరంగల్ నగరం స్మార్ట్ సిటీ గా చేస్తామని అనేక వాగ్దానాలు చేసి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజలను మోసం చేశాయన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి ప్రభాకర్‌రెడ్డి, టీ ఉప్పలయ్య, జిల్లా కమిటీ సభ్యులు గొడుగు వెంకట్, జి రాములు, వాంకుడోత్ వీరన్న, ఆరూరి కుమార్, ఏ యాదగిరి, అఖిల్, జిల్లా నాయకులు భానునాయక్, మంద సంపత్, వేల్పుల సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.