Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేటను మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి నిధులు కేటాయించడంతోపాటు వరంగల్-నర్సంపేట వరకు ఎకనామికల్ జోన్‌గా పరిగణించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భేటి అయ్యారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధికి చేపట్టాల్సిన వివిధ పనులు, పెండింగ్ పనుల పూర్తికి సహకారంపై మంత్రి కేటీఆర్‌కు రూపొందించిన ప్రణాళికను అందజేసి ఎమ్మెల్యే చర్చిం చారు. నర్సంపేట పట్టణాభివద్దిపై ప్రత్యేక దృష్టి సారిం చాలని కొత్త పనుల మంజూరు చేయడంతో పాటు పెండింగ్ పనుల పూర్తికి సహాకారం అందించాలని కోరారు. నర్సంపేట నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషల్ ఎకనామికల్ జోన్ ఏర్పాటు చేయాలన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఆశీస్సులతో వరంగల్-నర్సంపేటను ఎకనామికల్ జోన్‌గా ప్రకటించారని గుర్తు చేశారు. నర్సంపేట నుండి వరంగల్ వరకు ఫోర్ లైన్ రోడ్డు మార్గాన్ని నిర్మాణం చేయాలన్నారు. తద్వారా నర్సంపేటకు పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. పర్యాటక శాఖ గుర్తించిన మాధన్నపేట చెరువును మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం పూర్తికి మరో రూ.5 కోట్లను కేటాయించాలన్నారు. నర్సం పేట పట్టణం దినాదినాభివృద్ధి చెందుతున్నందున వాహనాల రాకపోకలు పెరిగాయని, రద్దీ నియంత్రించ డానికి రింగురోడ్డు పూర్తికి మరో 15 కిలోమీటర్ల మేరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పారు. మోడల్ సిటీ ప్లాన్‌లో భాగంగా 100 శాతం రోడ్ల నిర్మాణం చేపట్టడానికి రూ.15 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కిందటి మూడేండ్లలో పట్టణాభివృద్ధికి చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కేటీఆర్‌కు వివరించారు. ఇందుకోసం అధికారింక ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి తన శాఖకు సంబంధించి ప్రతిపాదనలకు నిధుల కేటాయించి సంపూర్ణ సహకారం అందజేస్తానని, త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులపై సమీక్షిస్తానని కేటీఆర్ హామీనిచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.