Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వరంగల్ ఎంపీ పసునూటి దయాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఓ శుభకార్యానికి హజరయ్యారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన ఏడేండ్లలో ఎవరు చేయలేని అభివృద్ధి చేసి చూపించాడన్నారు. ఏ గ్రామానికెళ్లినా అభివృద్ధే కనబ డుతుందన్నారు. మిషన్ భగిరథ, కాకతీయ, డబుల్ బెడ్ రూంలు, వృద్ధులకు, వితంతువులు, వికాలాంగులకు 3 వేల పింఛను, కులవృత్తులవారికి పింఛన్లు మంజూరు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడాన్నారు కాళే శ్వరం ప్రాజెక్టును ప్రారంభించి రాష్ట్రఅభివృద్ధికి పాటు పడ్డాడ న్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, ఎంపీటీసీ మ్షోటపోతుల శివశంకర్‌గౌడ్ అశోక్‌రెడ్డి, సొసైటీ చైర్మెన్ పోరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి, పోలసాని లక్ష్మి నర్సింగరావు, మోతె కరుణాకర్‌రెడ్డి మోటపోతుల చందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.