Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
పల్లె ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన ప్రజాసమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిఖిల చెప్పారు. ుండలంలోని మండలగూడెం గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించి తనిఖీలు నిర్వహించారు. పల్లె ప్రకతి వనాన్ని కలెక్టర్ పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీలో విద్యుత్ సమస్య ఉన్నట్లు కాలనీవాసులు తెలుపగా ఆ శాఖ ఎస్ఈకి ఆదేశాలు జారీ చేశారు. వైకుంఠదామాన్ని తనిఖీ చేశారు. పిచ్చిమొక్కలు తొలగించాలని, చుట్టూ గ్రీన్ ఫెన్సింగ్లా మొక్కలు నాటాలని సూచించారు. గ్రామంలోని నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్లను ఆమె పరిశీలించి సూచనలు అందించారు. కమ్యూనిటీ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీవో రాంరెడ్డి, రఘునాథపల్లి ఎంపీడీఓ హాసిం, జెడ్పీటీసీ అజరు మణికంఠ, సర్పంచ్ ఉమారాణి, తదితరులు ఉన్నారు.
ప్రజలను భాగస్వామ్యం చేయాలి : అడిషనల్ కలెక్టర్
మహబూబాబాద్ : పట్టణ ప్రగతిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని 30వ వార్డులోని గుండ్లకుంట కాలనీలో పర్యటించి ప్రజాసమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఖాళీ ప్రదేశాలకు సంబంధించి యాజమానులకు నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్న ఆదేశించారు. మూడు కోట్ల సెంటర్, ఫాతిమా స్కూల్ వద్ద హరితహారం కార్యక్రమాలను పరిశీలించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, మున్సిపల్ చైర్పర్సన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరేందర్‌రెడ్డి, మున్సిపల్ ఏఈ భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
23వ వార్డులో...
కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తంగెళ్ల నరేందర్‌రెడ్డి మాట్లాడారు. బాబా గుట్ట కాలనీలో వినియోగంలో లేని రోడ్డును జేసీబీ సాయంతో బాగు చేసి ఉపయోగంలోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఏఈ క్రాంతి, పట్టణ ప్రగతి వార్డు ఇన్‌ఛార్జి కందుకూరి శ్రీనివాస్, అభివద్ధి కమిటీ సభ్యులు సత్యనారాయణ, సందీప్, హన్మంతు, వెంకట్రాములు, తదితరులు పాల్గొన్నారు.
24వ వార్డులో..
కౌన్సిలర్ మార్నేని వెంకన్న ఆధ్వర్యయంలో లెనిన్ నగర్ కాలనీలో పర్య టించారు. ఇంటింటికీ వెళ్లి పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ హరీష్ రాజ్ మాట్లాడారు. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించి ఈగలు, దోమలు ప్రబలకుండా చూసుకోవాలని, తదితర సూచ నలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు మల్లం రాజేష్, విజరుకుమార్, ఏఈఈ ప్రవీణ్, కిరణ్‌కుమార్, పిట్టల గోపాల్, అంగన్వాడీ ఆయాలు హిమబిందు, మహమూద, ఆశావర్కర్లు విజయలక్ష్మీ, స్వాతి, రమ, మంగ పాల్గొన్నారు.
ములుగు : జగ్గన్నపేట, మదనపల్లి గ్రామాల్లో ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్ పాల్గొని మాట్లాడారు. పల్లెలను శుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పొరిక విజరురాంనాయక్, మహేం దర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సారయ్య, రఘువరన్ తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపురం : మండలంలోని బర్లగూడెం పంచాయతీ ఒంటిమామిడి గ్రామంలో సర్పంచ్ కొర్సా నర్సింహమూర్తి ఆధ్వర్యంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు మాట్లాడారు. కార్యక్రమంలో కార్యదర్శి యాదవ రాజు, వీఆర్వో మధుసూదన్, ఉపాధ్యాయురాలు ఇందిరా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మంగపేట : మండలంలోని బాలన్నగూడెంలో పారిశుధ్యం-పరిశుభ్రత, ఫ్రైడే డ్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా 10 వార్డుల్లో ఎంపీడీఓ ఇక్బాల్ హుస్సేన్, ఎంపీఓ శ్రీకాంత్ బెహరా పర్యటించి మాట్లాడారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రఘు, అంన్‌వాడీలు, ఆశలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తొర్రూరు : 16 వార్డుల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు మాట్లాడారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
తొర్రూర్ టౌన్ : అమ్మాపురం గ్రామంలో ఫ్రైడే డ్రైడే నిర్వహించగా సర్పంచ్ కడెం యాకయ్య మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ శ్రావణి, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు, మార్క శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : మండలంలోని కొత్తపేట గ్రామంలో ఫ్రైడే డ్రైడే నిర్వహించగా జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు పాల్గొని మాట్లాడారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎస్పీ కాలనీలో పర్యటించి ప్రజలకు సూచనలు అందించారు. అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇర్ప మమత, ఎంపీడీఓ చలపతి రావు, తహసీల్దార్ నాగభవానీ, ఎంపీఓ పద్మ, గంధంపల్లి పీహెచ్సీ వైద్యుడు రాజేంద్రప్రసాద్, పంచాయతీ కార్యదర్శి శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
కొడకండ్ల : మండలంలోని మొండ్రాయి రెవెన్యూ డివిజన్ పరిధిలోని గిరి తండాలోని ప్లాంటేషన్ ఇంటర్నల్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలను జెడ్పీ సీఈఓ విజయలక్ష్మీ పరిశీలించి సూచనలు చేశారు. గ్రామాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని సర్పంచ్‌లను, ఎంపీటీసీలను ఆమె కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి, సర్పంచ్‌లు రాజ్‌కుమార్, మహేష్‌నాయక్, ఇన్‌ఛార్జి ఎంపీడీఓ దైవాదీనం, ఏపీఓ కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
గూడూరు : మండలంలోని బొద్దుగొండ, కొల్లాపురం, అప్పరాజుపల్లి గ్రామాల్లో మండల స్పెషల్ ఆఫీసర్ ఛత్రునాయక్, తహసీల్దార్ శైలజ, ఎంపీడీఓ విజయలక్ష్మీ, సర్పంచ్ నునవత్ రమేష్ పర్యటించారు. పల్లె ప్రగతిలో చేపడుతున్న చర్యల గురించి తెలుసుకున్నారు. ఇల్లిల్లూ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత పరిశీలించారు. సర్పంచ్ మాలోత్ సునీత బావుసింగ్ సింగ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బొద్దుగొండ సర్పంచ్ ముక్క లక్ష్మణరావు, కొల్లాపురం సర్పంచ్ పిన్నింటి సుధాకర్‌రావు, సర్పంచ్ తులసి రామ్ నాయక్, బోల్లపల్లి సర్పంచ్ సునీత, నాయకపల్లి సర్పంచ్ శశికళ, తదితరులు పాల్గొన్నారు.
గార్ల : స్థానిక, ముల్కనూరు పంచాయతీల్లో సర్పంచ్‌లు అజ్మీర బన్సీలాల్, వట్టం జానకిరాణీ అధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా పంచాయతీ ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న జేసీబీలతో పిచ్చి మొక్కలను తొలగించారు. అరోగ్య సిబ్బందితో కలిసి ఇంటి పరిసరాలలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్రావు, ఎంపీఓ కిషోర్ కుమార్, కార్యదర్శులు లక్ష్మణ్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.