Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిర్యాదుల పరిష్కారంలో చొరవ చూపాలి
- పోలీస్‌స్టేషన్‌లో సీపీ తరుణ్ జోషీ తనిఖీ
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి ప్రజలకు పోలీ సులు జవాబుదారీగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన సందర్శించి తనిఖీ చేశారు. తొలుత మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనృసింహస్వామి ఆల యాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ తనిఖీ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరిం చేందుకు దష్టి పెట్టాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీస్తో ప్రజల్లో మమేకం కావా లని చెప్పారు. రికార్డులను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేసి సీఐ, ఎస్సైలతోపాటు పోలీసు సిబ్బందిని అభినందించారు. అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టేం దుకు సీసీ కెమెరాల నిఘా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్, పాలకుర్తి సీఐ వట్టె చేరాలు, ఎస్సై గండ్రాతి సతీష్, తదితరులు పాల్గొన్నారు.
కొడకండ్ల : పోలీస్‌స్టేషన్‌ను సీపీ తరుణ్‌జోషీ తనిఖీ చేశారు. అధికారులకు సూచనలు అందించారు. సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ గొల్ల రమేష్, సీఐ వట్టె చేరాలు, ఎస్సై పవన్‌కుమార్ ఉన్నారు.