Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క
- తోపుడు బండి ఫౌండేషన్ చేయుత
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు, ధర్మ మీటర్, స్టడీ మెటీరియల్, నోట్ బుక్స్, పాత్రికేయులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్ కన్స్టేటర్, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల అందించడం అభినందనీయమని తోపుడు బండి ఫౌండేషన్ అధినేత షేక్ సాధిక్ అలీ, మిత్రబందం సేవలు మరువలేనివని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం సీతక్క చేతులమీదుగా ఆక్సిజన్ కన్స్ టేటర్, శానిటైజర్ ఎన్-95 మాస్కులు తాడువాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆస్నాల శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర ఆధ్వర్యంలో సీతక్క చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడార. కరోన విపత్కర సమయంలో విద్యార్థులకు, హాస్పటల్‌కు, వైద్య సిబ్బందికి, పాత్రికేయులకు అందించడం అభినందనీయమని తెలిపారు. సాదిక్ మొదట ఆయన ఒక సాధారణ అక్షర ప్రేమికుడు, అనంతరం పాత్రికేయుడు, తర్వాత విజయవంతమైన స్థిరాస్తి వ్యాపారి, అటు మీదట తోపుడు బండి సాదిక్ అని కొనియాడారు. అనంతరం సీతక్క తాడ్వాయి, కామారం గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇర్ప సునీల్ ధొర, కామారం సర్పంచ్ కళ్యాణి, కళాశాల అధ్యాపకులు రాములు, సంధ్య, మూర్తి, శ్వేతా, కిషన్, బిక్షం, రాజ్ కుమార్, అశోక్, రాజు, శ్రీలత, రాజు, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమార్ స్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, మాజీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, లచ్చు పటేల్, ములుగు ఎంపీటీసీ మావురపు తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ సిద్ది రెడ్డి, మండల నాయకులు పిట్టల సారయ్య, కొర్నిబెల్లి నాగమణి, మేడం రమణ కర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.