Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల నల్ల బెల్లం, పది కేజీల పటికను మండల పరిధిలోని బాలాజీ పేట వద్ద పట్టుకొని మహబూబాబాద్ రూరల్ మండలం బోడ గుట్ట తండాకు చెందిన భూక్యా బాలాజీ, భూక్య శ్రీను, భానోత్ కుమార్ మరియు బానోత్ వెంకన్నలపై కేసు నమోదు చేసిన ఎస్సై జగదీష్ తెలిపారు.
తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు
తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై జగదీష్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన షేక్ దస్తగిరి శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి తన కొడుకు షేక్ సైదులు తన భార్యను కేసముద్రం మండలంలోని కోరుకొండపల్లిలో దించి వచ్చి గురువారం రాత్రి కొత్తపేట నుంచి కోటగడ్డకి వెళ్లే దారిలో అలిగేరు బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మందు తాగి చనిపోయినట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.