Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-భూపాలపల్లి
పేదల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి, గ్రామీణ త్రాగునీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వారియర్స్ వలననే కరోనా సమయంలో ప్రజలను ఇబ్బందుల నుండి కాపాడ గలిగామని ఆయన పేర్కొన్నారు. కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్ లో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆధ్వర్యంలో కరోనా వారియర్స్‌కు సోమవారం సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేతతో కలిసి కరోనా వారియర్స్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా పాండమిక్ సమయంలో ముందువరుసలో ఉండి ప్రజలకు క వైద్యఆరోగ్యం, గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీ, పోలీస్ తదితర శాఖల సిబ్బంది వలననే ప్రజలను కరోనా సమయంలో రక్షించుకోగలిగామని, వారి సేవలు ఎప్పటికీ గుర్తుంచుకునేవన్నారు.
పేదల సంక్షేమం కోసం ఆలోచించే రాష్ట్ర ప్రభుత్వం కరోన కష్ట సమయంలో బడ్జెట్ లేకున్నా పేదల సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. పది వేల కోట్ల రూపాయల రైతుబంధు చెల్లించామని, రెండు వేల కోట్ల రూపాయలతో వరంగల్ లో అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నామని, 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పింఛన్ ఇప్పించేందుకు చర్యలు తీసుకుం టున్నామని పేర్కొన్నారు. అనంతరం సబ్ స్టేషన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ను ప్రారంభించారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు మిగిలి ఉన్న 350 మీటర్ల సీసీ రోడ్డును పూర్తిచేయాలని, గ్రామంలో ట్యాంకు నిర్మించి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, మండల అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రైతాంగానికి ప్రభుత్వం పెద్దపీట
నవతెలంగాణ-శాయంపేట
మండల కేంద్రంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, వరంగల్, పెద్దపెల్లి ఎంపీలు పసునూరి దయాకర్, వెంకటేష్ నేతలతో కలిసి మంత్రి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ కందగట్ల రవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతాంగానికి పెద్దపీట వేస్తూ 24 గంటల ఉచిత కరెంటు, గోదావరి జలాలను ప్రతి గ్రామానికి మళ్ళించి సాగునీరు అందించడమే కాక, మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన జలాలను అందిస్తున్నారన్నారు. రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, సబ్సిడీపై ఎరువులు విత్తనాలు, పంటలకు గిట్టుబాటు ధర అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో అనుకున్నంత పనులు జరగలేదని, వ్యవసాయానికి ఈజీఎస్ అనుసంధానం చేయాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ నివేదిక అందించినట్లు తెలిపారు. రైతు చైతన్యానికి రైతు వేదికలో నిలుస్తాయన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఛాలెంజ్‌గా తీసుకొని పనిచేయాలన్నారు. సర్పంచులకు ఇటీవలనే వెయ్యి కోట్లు విడుదల చేసి బిల్లును చెల్లించామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని, మండలానికి 5 గ్రామాలలో విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివద్ధి చేస్తామన్నారు. పూర్వ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి అభివద్ధి చేసుకోవాలన్నారు. శాయంపేట మండలానికి ఎక్కువ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ అవతరణ జరిగిందన్నారు. మంత్రి సహకారంతో నియోజకవర్గంలో 20కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం మందారిపేట నుంచి ప్రగతి సింగారం వరకు రూ.6 కోట్ల 9 లక్షల తో నిర్మించనున్న డబల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరి సింగ్, డీఆర్డీఓ పీడీ సంపత్ రావు, ఆర్డీఓ మహేందర్ జి, జేడీఏ ఉషా దయాల్, పరకాల ఏడీఏ రవీందర్, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ రామిశెట్టి లత లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఏఓ గంగా జమున, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
నవతెలంగాణ-ఆత్మకూరు
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. ఆయన సోమవారం మండంలోని హౌజ్బుర్గ్ నుంచి ప్రగతి సింగారం వరకు 3కోట్ల 21లక్షలతో నిర్మించిన డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ షేక్ రబియాబీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. గ్రామంలోని పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, పంచాయతీ కార్మికులు చిత్తశుధ్ధితో పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరోసారి ఈ గ్రామాన్ని పరిశీలిస్తానని అప్పటి వరకు సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పసునూరి దయాకర్, వెంకటేష్, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ ఎం పీపీ సుమలత, జెడ్పీటీసీ రాధిక, ఏఎంసీ చైర్మన్ కాంతాల కేశవరెడి,్డ ఎంపీడీఓ నర్మద పాల్గొన్నారు.
నవతెలంగాణ-రేగొండ
సోమవారం మండలంలోని చెన్న పూర్, రాజక్కపల్లి గ్రామాల మధ్య రూ.లు 5కోట్ల 13లక్షలతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులను మంత్రి దయాకర్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ ప థకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.
పల్లెప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యం వహించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడపాలన్నారు. ఈ సందర్భంగా చిన్నపూర్ సర్పంచ్ పంచాయతీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని విన్నవించగా, ఆయన చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రూ.లు 4కోట్లతో రేపాక నుంచి వరంగల్ రూరల్ జిల్లా పరకాల వరకు రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, రూరల్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ రిజ్వాన్ పాషా, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాంబారి సమ్మ రావు, జెడ్పీటీసీ విజయ, ఎంపీపీ లక్ష్మీ రవి, ఎంపీడీవో సురేందర్, తహశీల్దార్ జివాకర్ తదితరులు పాల్గొన్నారు.