Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వర్ధన్నపేట
మహిళా సంఘాల సభ్యుల సమగ్ర సమా చారంతో పాటు ఆర్థిక లావాదేవీలను సకాలంలో ఆన్లైన్లో నమోదు చేయుటకు వీఓఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇల్లంద క్లస్టర్ కో-ఆర్డినేటర్ కొమురయ్య అన్నారు. సోమవారం స్థానిక బందావన మండల మహిళా సమైక్య కార్యా లయంలో గంగా క్లస్టర్ వీవోఏ లకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వము నిర్దేశించిన లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయుటకు వీఓఏలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. సంఘాలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడమే కాకుండా, వివిధ సంస్థల ద్వారా పొందిన రుణాలతో న్యూ ఎంటర్ప్రైజెస్ లో భాగంగా ఆస్తులను ఏర్పాటు చేయుటకు మహిళలకు తగిన చేయూతనివ్వాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో సీసీలు రమేష్, స్వామి, ఇల్లంద, ఉప్పరపల్లి కడారిగూడెం, రామ్ దన్ తండా గ్రామ ఐక్య సంఘాల సహాయకులు తక్కలపెల్లి శోభా, రమ్య, కత్తి స్రవంతి, రోజా, తక్కలపెల్లి పద్మావతి, కవిత, హైమ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు