Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాటించని ఖాళీ స్థలాల యజమానులపై చర్యలు
- జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ-మహబూబాబాద్
సమాజంలోని ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. పరిశుభ్రత పాటించని ఖాళీ స్థలాల యజమా నులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పల్లె, పట్టణ ప్రగతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని 30వ వార్డు పరిధిలోని గుండ్లకుంట కాలనీలో ఆయన సోమవారం పర్యటించారు. పట్టణ ప్రగతి పనులను ప్రత్యక్షంగా పరిశీ లించారు. లోతట్టు ప్రాంతాల్లోని ఖాళీస్థలాల్లో వర్షపు నీరు నిలిచి దోమలు ప్రబలు తున్నాయని, పందులు ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుని దుర్ఘంధాన్ని వెదజలు ఫోటో రైటర్ గుండ్లకొండ కాలనీలో పర్యటిస్తున్న కలెక్టర్ గౌతమ్
్లతున్నాయని స్థానికులు కలెక్టర్ దష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఖాళీ స్థలాల్లో నీరు, చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంటే సంబంధిత యజమానులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలక ముందే శరవేగంగా పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. లేనిపక్షంలో వార్డ్ కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు పనులు చేపట్టి సదరు స్థలాల యజమానులపై జేసీబీ, మొరం, ట్రాక్టర్ తదితరాల ఖర్చును రెండింతలు వసూలు చేయాలని తెలిపారు. అనంతరం నాల్గో వార్డు పరిధిలోని గాంధీపురంలో చేపట్టిన మెగా హరితహారం కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. సుమారు 1.50 ఎకరాల్లో చేపట్టిన పనులను పరిశీలించి ఖాళీగా ఉన్న షెడ్డు నిర్మాణాలను తొలగించాలని, బావిని శుభ్రం చేసి ప్రహరీ నిర్మించాలని, తదితర సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేందర్‌రెడ్డి, వార్డు ప్రత్యేక అధికారి అనిల్ కుమార్, 30 వార్డు కౌన్సిలర్ విజయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : మున్సిపల్ పరిధిలోని 5, 9, 12, 13, 14 వార్డుల్లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యటించారు. పురపాలిక పరిధిలో నర్సరీలు, అందుబాటులో ఉన్న మొక్కలు, నాటినవి, నాటాల్సినవి, తదితరాల గురించి ఆరా తీశారు. పట్టణ ప్రగతి ప్రణాళిక, బడ్జెట్, రోజు వారీ కార్యక్రమం, హరితహారం, ప్రజా మరుగుదొడ్లు తదితర సమస్యలపై గుర్తించాల్సిన అంశాలపై ఆదేశాలిచ్చారు. ఐదో వార్డులో పట్టణ ప్రకతి వనానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్‌బాబు, తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, వైస్ చైర్మెన్ జినుగు సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు ధరావత్ సునీత, అలివేలు, గుగులోతు శంకర్, ఎన్నమనేని శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర మండలంలో..
మండలంలోని పోచారం, బొమ్మకలు గ్రామాలను ఎంపీపీ ఈదురు రాజేశ్వరి సందర్శించారు. తాగునీటి ట్యాంకులను, ఇండ్లల్లోని నీటి తొట్టిలను, పైపులైన్ లీకేజీలను పరిశీలించారు. శుక్రవారాల్లో బ్లీచింగ్ పౌడర్‌తో కడగాలని, లీకేజీలు లేకుండా చూడాలని సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉంటే మొరం పోయాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రావూరి రాజు, ఎంపీడీఓ శేషాద్రి, సర్పంచ్‌లు కేతిరెడ్డి దీపిక సోమనర్సింహారెడ్డి, మానవత్ లక్ష్మీ బాలునాయక్, ఎంపీటీసీ సాయిని ఝాన్సీ రవి, ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణ, గిరిగాని ఐలయ్య, మిషన్ భగీరథ ఏఈ యాకూబ్ పాషా, ఏపీఎం వీరయ్య, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కూకట్ల వీరన్న, యూత్ నాయకులు యాకన్న, రామ్మూర్తి, పంచాయితీ కార్యదర్శులు మణికుమార్, మహేష్, ధరావత్ రవి, తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : మండలంలోని రతిరాంతండాలోని మెగా పల్లె ప్రకతి వనాన్ని మండల ప్రత్యేక అధికారి బాలరాజు, తహసీల్దార్ సయ్యద్ రఫీ, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి పరిశీలించారు. ప్రకతి వనంలో డోజర్‌తో లెవలింగ్ చేయించారు. అనంతరం వారు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీఓ పార్థసారథి, సర్పంచ్ బిక్కునాయక్, పంచాయతీ కార్యదర్శి నేహా తరుణం పాల్గొన్నారు
మంగపేట : మండలంలోని కమలాపురం ప్రభుత్వం జెడ్పీ పాఠశాలలో ఎంపీడీఓ ఇక్బాల్ హుస్సేన్, ఫారెస్టు రేంజ్ అధికారి షకీల్ పాషా, ఎంఈఓ లకావత్ రాజేష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సాదు మురళీ అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం కమలాపురం గ్రామ పంచాయతీకి చెందిన 25 మంది సిబ్బందిని ఎంఈఓ రాజేష్ కుమార్ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నర్సింహ, వెంకటేశ్వర్లు, సాంగపాణి, కిరణ్, వెంకటరమణ, అనంతరావు, కేశవరావు, రాజేశ్వర్‌రావు, రాజమౌళి, నర్సింగరావు, రాయప్ప పాల్గొన్నారు.
ములుగు : ములుగు ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ బండారి నిర్మల హరినాధంతో కలిసి ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, కోఆప్షన్ సభ్యుడు యూనిస్, తరుణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జనగామ : పట్టణంలోని ఒకటో వార్డులో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున పర్యటించి మాట్లాడారు. అధికారులతో కలిసి ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసారు. వార్డు ప్రత్యేక అధికారి రోజారాణి, కౌన్సిలర్ అరుణ విజరుకుమార్, అధికారులతో మాట్లాడి శుభ్రం చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సింహ, టీఎస్ఐఐసీ అధికారి మహేష్, ఆర్ఐ, టీపీఓ, స్థానికులు పిట్టల రాజేష్, విజరు, సురేష్, తదితరులు పాల్గొన్నారు
తరిగొప్పుల : మండల కేంద్రంలో, మరియాపురంలో జెడ్పీ సీఈఓ విజయలక్ష్మీ పర్యటించారు. మొక్కల పెంపకం పనులను పరిశీలించి మాట్లాడారు. సమాజంలోని ప్రతిఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించడాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఇంద్రసేనారెడ్డి, స్పెషలాఫీసర్ శ్రీపతి, ఏఈఓ పూర్ణచందర్, ఏపీఎం కుమారస్వామి, ఈసీ లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.