Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ములుగు ఏరియా ఆస్పత్రికి సికింద్రాబాద్‌కు చెందిన లయన్స్‌క్లబ్ ప్రతి నిధులు శాశ్వత పరికరాలు అందించడం అభినందనీయమని ఏఎస్పీ పోతురాజు సాయిచైతన్య అన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీష్ అభ్యర్ధన మేరకు పూర్వ లయన్స్‌క్లబ్ గవర్నర్ దీపక్ భట్టాచార్జీ జన్మదినాన్ని పురస్కరించు కుని లయన్స్‌క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వివేకానందపురం సహకారంతో క్లబ్ డైరెక్టర్ పింగిలి నాగరాజు సమకూర్చిన సక్షన్ పరికరాలను ఏఎస్పీ సాయిచైతన్య చేతుల మీదుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్‌కు సోమవారం అందించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడారు. ఆపరేషన్, విషం కక్కించే సమయాల్లో పనికొచ్చే పరికరాలు ఆస్పత్రికి కొన్నేండ్లపాటు ఉపయోగపడతాయని చెప్పారు. స్వచ్చంద సంస్థలు శాశ్వత ప్రాతిపదికన నిలిచిపోయే సేవలు అందించా లని ఆకాంక్షించారు. క్లబ్ డైరెక్టర్ లయన్ పింగిలి నాగరాజు మాట్లాడుతూ ఆస్పత్రికి సక్షన్ పరికరాలు అవసరమని తెలిసి రూ.32 వేలు విలువైన పరికరాలను సమకూర్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య, డాక్టర్ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.