Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
వస్త్ర ప్రపంచంలో అతి పెద్ద మాంగళ్య షాపింగ్ మాల్ హైదరాబాద్ నగరంలోని ఏఎస్‌రావ్ నగర్లో పదో షాపింగ్ మాల్‌ను సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప్పెన ఫేం కీర్తి శెట్టితో కలిసి రాష్ట్ర కార్మిక,ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషరెడ్డి, మాంగల్య షాపింగ్ మాల్ ఫౌండర్ పీఎన్ మూర్తి, చైర్మెన్ కాసం నమశ్శివాయ హాజరయ్యారు. షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన అనంతరం కీర్తి శెట్టి మాట్లాడుతూ ఫ్యాషన్ రంగంలో మంగళ షాపింగ్ మాల్ ఫ్యాషన్ దుస్తులతో కస్టమర్ల నమ్మకాన్ని పొందడమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అతికొద్ది కాలంలోనే నాణ్యమైన, మన్నికైన మారుపేరుగా నిలిచిన అంతేకాకుండా తమ సంస్థల ద్వారా సుమారు 3500 మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు. మాంగల్య షాపింగ్ మాల్ ఫౌండర్ పీఎన్ మూర్తి మాట్లాడుతూ కుటుంబంలోని ప్రతిఒక్కరి కోసం అత్యున్నతమైన, ఆకర్షణీయమైన వస్త్ర శ్రేణిని ప్రవేశపెట్టి కస్టమర్ల మనసుని దోచుకుంటన్న మాంగల్య షాపింగ్ మాల్ హైదరాబాద్‌లో ప్రవేశించి రెండేండ్లు పూర్తైందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో మదినగూడ, బోడుప్పల్, వనస్థలిపురం, కూకట్పల్లి, చింతల్, అమీర్పేట్ల్లో ఇప్పటికే షోరూమ్‌లు ఏర్పాటు కాగా ఏడో స్టోర్‌ను ఏఎస్రావు నగర్లో వైవిధ్యభరితంగా ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండల్లోని స్టోర్లతో కలిసి తెలంగాణ మొత్తం మీద పదో స్టోర్ అని చెప్పారు. అన్ని వయసులకు చెందిన కొనుగోలుదారులకు అవసరమైన అన్ని రకాల ఫ్యాషన్, స్టైల్ కొరకు తమ స్టోర్లను సందర్శించాలని కోరారు. సంస్థ చైర్మెన్ కాసం నమశివాయ మాట్లాడుతూ 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగేండ్లలో అత్యాధునిక హంగులతో ఏర్పాటైన షాపింగ్ మాల్లో విస్తత శ్రేణికి చెందిన చీరలు, లెహంగాలు వెస్ట్రన్ వేర్, వెడ్డింగ్ వేర్, మెటీరియల్స్, అనేక రకాల వస్త్ర శ్రేణులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పిల్లలు మొదలుకొని పెద్ద వారి వరకు వారికి అవసరమైన పార్టీ పండుగ దుస్తులు, కాంచీపురం, పట్టు, ఉప్పాడ, ఫ్యాన్సీ చీరలు, అన్ని రకల వస్త్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు స్టోర్లను విస్తరిస్తామని చెప్పారు. షాపింగ్ మాల్స్ నిర్వాహకులు కస్టమర్లకు అందుబాటులో ఉన్న ధరలకు రాబోయే దసరా, దీపావళి పండుగను కస్టమర్లు ఉత్సాహంతో జరుపుకోవడానికి వీలుగా అన్ని వస్త్రాలను సరసమైన ధరలో కస్టమర్లలకు అందిస్తామన్నారు.
మాంగల్య షాపింగ్ మాల్ నేపథ్యం
1942లో వరంగల్‌లో ఒక రిటైల్ ఫ్యాషన్ స్టోర్‌గా ప్రారంభమైన కాసం గ్రూప్‌కు చెందిన మాంగల్య షాపింగ్ మాల్ 2019 నాటికి వస్త్ర వ్యాపార రంగంలో అతిపెద్ద కింగ్డంగా అవతరించింది. మొత్తం 8 ఫ్లోర్లతో అతిపెద్ద నెట్వర్క్ రూ.300 కోట్లకుపైగా వార్షిక టర్నోవర్‌తో 18 వేల మందికిపైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ మొత్తం స్టోర్లు లక్షా 35 వేల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణం కలిగి ఉన్నాయని చెప్పారు. తెలంగాణలోని మరే ఇతర వస్త్ర శ్రేణి మాల్ అందించని రీతిలో మాంగల్య షాపింగ్ మాల్ దినదిన అభివద్ధి చెందుతోందన్నారు. అత్యంత నమ్మకంగా నాణ్యతగా వివాహ వేడుకలకు ప్రసిద్ధి చెంచింది. కార్యక్రమంలో మాంగల్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ పాల్గొన్నారు.