Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1797 కేసుల పరిష్కారానికి కృషి
- జిల్లా న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు
నవతెలంగాణ-వరంగల్
ఈనెల 10న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయమూర్తి నందికొండ నర్సింహారావు తెలిపారు. ఈ సందర్భంగా 1797 పెండింగ్ కేసులను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా కోర్టులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా కోర్టులోనే కాకుండా నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, జనగామ, పరకాల, తొర్రూరు కోర్టుల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ నేరుగా కోర్టు ప్రాంగణంలోగాని లేదా వర్చువల్ సమావేశం ద్వారా గానీ పరిష్కరించేలా వసతులు, సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కక్షిదారులు వారి వీలును బట్టి కేసులను రాజీ కుదుర్చుకోవాలని కోరారు. లోక్ అదాలత్‌లో రాజీపడదగు క్రిమినల్, సివిల్, భూతగాదాల, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్, వివాహ, కుటుంబ తగాదా, బ్యాంకు, చెక్‌బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్‌ఫండ్, ఇన్సూరెన్స్, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, ప్రీ లిటిగేషన్, తదితర రాజీపడదగు కేసులను ఇరు పక్షాలు అంగీకారంతో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడానికి పోలీసు ఉన్నతాధికారులతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో, సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించినట్టు వివరించారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జయకుమార్, ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రభాకర్‌రావు, 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిద, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మహేష్‌నాథ్ పాల్గొన్నారు.