Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
ఈనెల 15న భూసమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. బుధ వారం పట్టణంలోని గబ్బేట గోపాలరెడ్డి భవన్ సీపీఐ జిల్లా కార్యాలయంలో ఎండీ యాకుబ్ పాషా అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితులకు, పేదలకు భూములు పంచాల్సింది పోయి ఉన్న భూముల్ని అమ్మడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అధికారపార్టీ నాయకులు ప్రభుత్వ, చెరువుశిఖం, దేవాదాయ భూములు, అసైన్మెంట్ భూములు ఆక్రమిస్తూ కాజేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. కానీ, పేదల భూముల విషయంలో మాత్రం ప్రతాపాన్ని చూపిస్తున్నారని, విమర్శించారు. ప్రజా రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చేపట్టే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు మద్దతు తెలపాపలని కోరారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టుల పాత్ర కీలకమన్నారు. కమ్యూనిస్టు ప్రజల వద్దకు వెళ్లి ప్రజా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. ఈ సమావేశములో పాతురి సుగుణమ్మ, అది సాయన్న, ఆకుల శ్రీనివాష్, సొప్పరి సోమయ్య, కె విజయకుమార్, రావుల సదానందం, బొమ్మినేని వెంకటరెడ్డి, మల్లేశం, నిర్మల, రాజు పాల్గొన్నారు.