Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ భూపాలపల్లి
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తోందని, సామాన్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేకుండా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పెద్దాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎండీ షుకూర్ అన్నారు. బుధవారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాటాడారు. బుధవారం టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంలో గ్రామంలో తాము బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ అధికారులతో ఫ్లెక్సీలను తొలగింపచేశారని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి లేని సమయంలో ప్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే తప్పా అని ఆయన ప్రశ్నించారు బుధవారం పెద్దాపూర్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అప్రజాస్వామికంగా వ్యవహరించి ఫ్లెక్సీలను తొలగించారని తెలిపారు. ఈ ఘటన టీఆర్ఎస్ నియంతత్వ పాలనకు అద్దం పడుతోదన్నారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు కత్తి తిరుపతి, చెరుకు కుమార్, జనగాం పోచయ్య ,ఈర్ల చిరంజీవి, గట్టు మల్లేష్ , రమేష్, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.