Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-భూపాలపల్లి
రైతును రాజు చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం పెద్దాపూర్‌లో రైతువేదిక, పల్లెప్రకతి వనంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులను రాజులుగా నిలబెట్టేందుకు రైతు సంక్షేమ, అభివద్ధి పథకాలని అమలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఉచిత విద్యుత్, రైతు వేదికలు, ఏఈఓల నియామకం, రైతుబందు, 5లక్షల రైతుబీమా పథకాలని అమలు చేస్తున్నట్టు చెప్పారు. , ఎరువులు, విత్తనాల సరఫరా, ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగా, ప్రస్తుతం ఒక కోటి 5లక్షల ఎకరాలకు సాగునీటిని కాళేశ్వరం ప్రాజెక్టుతో సరఫరా చేస్తున్నామని తెలిపారు. దేవాదుల నీటితో భూపాలపల్లి, ములుగు జిల్లాల పంటభూములకు సాగునీరు పూర్తిస్థాయిలో అందించనున్నట్టు పేర్కొన్నారు. పెద్దాపూర్ గ్రామం ములుగు నియోజకవర్గంలో ఉండడం వలన కలుగుతున్న పరిపాలన ఇబ్బందులను సీఎంతో మాట్లాడతానని తెలిపారు. గ్రామ అభివద్ధికి 10 లక్షల రూపాయలు పల్లెప్రగతి నిధుల నుంచి ఇస్తానని, అదనంగా మరిన్ని నిధులను కలెక్టర్ నుంచి ఇప్పిస్తానని పేర్కొన్నారు.. ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేకంగా వెనుకబడ్డ ప్రాంతాలను అభివద్ధి చేసుకుందామన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా పల్లెలలో పచ్చదనం పెంపొందించుకోవాలన్నారు. గిరిజనలు, దళితుల జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలు గ్రామ అభివద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, రైతుబందు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, జెడ్పీ వైస్ ఛైర్పెర్సన్ కల్లెపు శోభా, ఎంపీపీ మందల లావణ్య, రైతుబందు సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు సుద్దమల్ల భార్గవ్, సర్పంచ్ మొండయ్య, ఎంపీటీసీ మహిపాల్ రెడ్డి, స్థానిక నాయకులు నారాయణ రావు, పూర్ణచంద్రరావు, సుధాకర్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కోటగుళ్ళను పర్యటకప్రాంతంగా తీర్చిదిద్దుతా
100 ఫీట్ల రోడ్డుకు నిదులు మంజూరు చేస్తా
గణపురం : రైతుల అభివద్ధే ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసమే గ్రామ, గ్రామాన రైతులు వేదికలు నిర్మించినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. బుధవారం మండల కంద్రంలో నూతనంగా నిర్మించిన రైతువేదికను, పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. జిల్లా కలెక్టర్ కష్ణఅదిత్యతో కలిసి ఆమె ప్రారంబించారు. అనంతరం సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. గణపేశ్వరాలయ అభివద్ధికి కృసి చేస్తానని తెలిపారు. గణపసముద్రం చెరువును పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని హామి ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణపురం నుంచి జంగాలపల్లి వరకు వంద ఫీట్ల రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టంను గతంలోనే మంజూరు చేశామని, అనివార్యకారణాలతో పనులు అగిపోయాయని తెలిపారు. ఈ పనులకు మళ్లీ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ కష్ణ అదిత్య మాట్లాడుతూ.. స్థానిక పీహెచ్సీలో ల్యాబ్ నిర్మాణం కోసం 20 లక్షలు మంజూరు చేస్తానన్నారు. మైలారం లోని గుహలకు. గణపేశ్వరాలయ అభివద్దికి తాత్కాలికంగా 40 లక్షలు మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్, ఎంపీపీ కావటి రజిత, ఎంపీటీసీ మ్షెటపోతుల శివశంకర్ గౌడ్, సోసైటి చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడి,్డ ఉపసర్పంచ్ పోతర్ల అశోక్, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ ఆశాలత, డీఆర్డీఓ పురుశోత్తం, ఎంపీడీఓ అరుంధతి, తహసిల్థార్ కష్ణచైతన్య తదితరులు పాల్గ్గొన్నారు
మాజీ సర్పంచ్ లకు ఘనసన్మానం
మండల కేంద్రంలో పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్యలు సర్పంచ్ దేవేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్‌లను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపంచాయతీ అభివృద్ధి కోసం 10లక్షల నిధులు మంజూరు చేశాడన్నారు. అంతర్గత రోడ్డు కోసం కోందరూ పని కట్టుకోని తనపై అరోపణలు చేస్తున్నారని, దశలవారిగా అభివద్ది చేస్తానని సర్పంచ్ హమీఇచ్చారు.