Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ కమిషనర్ డా|| తరుణ్ జోషి
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా
పోలీసులు అంకితభావంతో విధులు నిర్వ ర్తిస్తూ ప్రజల నమ్మకాని పొందాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పోలీసులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కేయూ పీఎస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా, హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, విశ్వేశ్వర్, ఇన్స్పెక్టర్ జనార్థన్ రెడ్డితో కలిసి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పొలీస్ స్టేషన్ రిసెప్షన్ కౌంటర్ పనితీరుకు సంబంధించిన వివరాలను సంబందిత విభాగం కానిస్టేబుల్‌ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో సీసీ కెమె రాల పనితీరుతో పాటు నేరాల నియంత్రణ, ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి సంబంధిత అధికారులనును ఆయన అడిగి తెలుసుకున్నారు. విధుల్లో రాణించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించించేందుకు రూపొందించిన వర్టికల్స్ విధానంపై అధికారులకు, సిబ్బందికి త్వరలోనే శిక్షణనివ్వనున్నట్టు పేర్కొ న్నారు. ప్రజలు అందించిన ఫిర్యాదులపై తక్ష ణమే స్పందించి భాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా పనిచేసి ప్రజల అభిమానాన్ని పొందాలని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా వుండా ల్సిన భాధ్యత పోలీసులపై ఉందన్నారు. నేరాల నియంత్రించడం కోసం సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ, ఏసీపీ, సీఐ, పోలీసు సిబ్బంది ఉన్నారు.