Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి
నవతెలంగాణ-హన్మకొండ
గుణాత్మకమైన విద్య కోసం పిల్లలను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిం చాలని అర్బన్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. బడిబాటలో భాగంగా న్యూశాయంపేట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్ర మంలో బుధవారం ఆమె పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తారని తెలిపారు. అందువలన పిల్లలను ప్రభుత్వ పాఠశాల ల్లోనే చేర్పించాలన్నారు. అనంతరం కార్పొరేటర్ రాజు మాట్లాడుతూ.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్బంగా పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం ఎన్ స్వామి, ఎస్ఎంసీ సభ్యులు కనుకుంట్ల కృష,్ణ ఉమా, ఉపాధ్యాయులు భాస్కర్ రవీందర్ రాజు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.