Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కక్షిదారులు రాజీ మార్గంలోకి వచ్చి సత్వరమే తమ కేసులను పరిష్కరించుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి సాకేత్ మిత్రా అన్నారు. బుధవారం అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడారు. లోక్అదాలత్ ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కారం చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. అనేక కేసుల్లో కోర్టులకు హాజరవుతున్న కక్షిదారులు, పలు కేసులను ఎదుర్కొంటున్న నిందితులు లోక్అదాలత్లకు హాజరై సత్వరమే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. చట్టాలు-న్యాయం, పలు కేసులు వాటికి పరిష్కారంపై జడ్జి వివరించారు. సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్ము రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి చిలువేరు కిరణ్కుమార్, పీపీ శరత్, న్యాయవాదులు దాసరి రమేష్, కొడిదల సంజరు కుమార్, పుట్టపాక రవి, పోలీసులు, కక్షిదారులు పాల్గొన్నారు.