Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి
- నాబార్డు ఏజీఎం అబ్దుల్ రవూఫ్
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
రసాయనిక ఎరువల వాడకంతో ఆహారం విష తుల్యమవుతుందని, అందువలన రైతులు సేంద్రియ ఎరువలను వాడాలని నాబార్డు ఏజీఎం అబ్దుల్రవుఫ్ అన్నారు. పనికరలో బుధవారం సర్పంచ్ పింగిళి విజయమోహన్రెడ్డి, శ్రీధరణి స్వచ్చంద సంస్థ ఛైర్మన్ శోభారాణి ఆధ్వర్యంలో మహిళా సమైఖ్య సభ్యులకు సేంద్రియ ఎరువుల తయారీపై బుధవారం అవగాహన సదస్సును నిర్వ హించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. నాబార్డు ద్వారా 60మంది మహిళలకు 15రోజులపాటు సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు మహిళా సమైక్య సభ్యులకు శిక్షణనిస్తున్నట్టు తెలిపారు. తద్వారా సేంద్రియ ఎరువుల తయారీ పెంచి రైతులు వినియోగించేలా ప్రోత్సహిస్తా మన్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో విషతుల్యమైన ఆహారం పిల్లలు, పెద్దలు సైతం వింత రోగాల బారిన పడుతున్నారని, అలాంటి విషపూరితమైన ఆహారాన్ని అరికట్టేందుకు సేంద్రియ పద్దతులను అవభించాలన్నారు. విఓ అధ్యక్షురాలు ప్రసన్న, కార్యదర్శి కవిత, రజిత, ఆమని, భవాని, సుజాత, శారద పాల్గొన్నారు.