Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నించిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ-వేలేరు
మండలంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఎమ్మెల్యే రాజయ్యను ప్రజలు నిలదీశారు. బుధవారం ఆయన పల్లెప్రగతి పనుల్లో భాగంగా మండంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రమంలో మల్లికుదుర్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా గ్రామస్తులు అడ్డుకుని ప్రశ్నించారు. గ్రామాల్లోని మురికివాడలు అలాగే ఉన్నాయని, సీసీ రోడ్లకు శంకుస్థాపన జరిగి నెలలు గడుస్తున్నా నిర్మించలేదని, ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను పట్టించుకోకుండా ఏం చేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు ప్రశ్నించిన వారిని కొద్ది సేపు అదుపులోనికి తీసుకున్న అనంతరం వదిలేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మల్లికుదుర్లలో వైకుంఠ దామం పనులు పూర్తి కాకపోవడంతో, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. పీచరలో జరిగిన కార్యక్రమంలో సైతం ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జెడ్పీటీసీ చాడ సరిత, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ రవి, కో ఆప్షన్ సభ్యులు జానీ తదితరులు పాల్గొన్నారు.