Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీసీఓ సంజీవ రెడ్డి అన్నారు. ఎంపీపీ కార్యాలయంలో బుధవారం ఆయన పల్లెప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చక్రాల సంతోష్ కుమార్, ఎంపీఓ మధుసూదన్ ఎపీఓ సుశీల్ కుమార,్ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.
దౌలత్‌నగర్‌లో సర్పంచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పల్లెప్రగతి పనుల్లో భాగంగా గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు, యువకులు శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు. ఏబీ తండాలో సర్పంచ్ మాలోతు ప్రమీల ఆధ్వర్యంలో విద్యుత్ సరఫరాకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు సర్వర్, స్పెషల్ ఆఫీసర్ కృష్ణమూర్తి, ఏబీ ండా ఉప సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, స్థానిక నాయకులు భద్రు నాయక్, గోపి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-మల్హర్ రావు
బుధవారం మండలంలోని తాడిచెర్ల, మల్లారం, అడ్వాలపల్లి, వల్లెంకుంట, కొయ్యూర్ గ్రామాల్లో ఎంపీడీఓ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాన రోడ్లకు ఇరువైపుల, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంపీపీ, ఎంపీడీఓతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులు వివిధ రకాల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-పరకాల రూరల్
పట్టణప్రగతిలో భాగంగా బుధవారం మున్సిపాలిటీ చైర్మన్ సోదా అనిత రామకష్ణ పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని వార్డుల అభివద్ధికీ తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, కమిషనర్ టీ శేషు, కౌన్సిలర్లు మడికొండ సంపత్, ఒంటేరు చిన్న సారయ్య తదితరులు పాల్గొన్నారు.
డంపింగ్ యార్డులను వినియోగంలోకి తేవాలి
నవతెలంగాణ-శాయంపేట
పల్లె ప్రగతిలో నిర్మించిన డంపింగ్ యార్డులను వినియోగంలోకి తేవాలని డీఆర్డీఓ శ్రీనివాస్ స్థానిక సర్పంచులకు సూచించారు. సూరంపేట,. శాయంపేట, మైలారం, హుస్సేన్ పల్లిల్లోని డంపింగ్ యార్డులను, మరుగుదొడ్ల నిర్మాణాలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. డంపింగ్ యార్డ్ లలో తడి, పొడి చెత్త వేరు వేరుగా వేయాలని, ఎరువుల తయారీ చేయాలని సూచించారు. హుస్సేన్ పల్లి, సూరంపేట గ్రామాలలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి అయినట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కీర్తి అనిత, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
గట్లకానీపర్తిలో పల్లెప్రగతిలో భాగంగా సర్పంచ్ బొమ్మకంటి సాంబయ్య ఆధ్వర్యంలో బుధవారం పురాతన ఇండ్లను జేసీబీతో కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో స్పెషలాఫీసర్ గంగా జమున, పంచాయతీ కార్యదర్శి నాగశ్రీ పాల్గొన్నారు.
నవతెలంగాణ-చిట్యాల
నైన్‌పాకలో బుధవారం పల్లెప్రగతి, హరితహారంలో భాగంగా జెడ్పీటీసీ గొర్రె సాగర్ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తొట్ల లక్ష్మీ, కార్యదర్శి విష్ణువర్ధన్ రావు, ఎంపీటీసీ కట్టెకొల్ల రమేష్, వార్డు సభ్యులు శ్రీపతి మమత రఘుపతి, గోవిందుల కేతమ్మ, దుద్దుకురి పుష్పలీల పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ శైలజా అన్నారు బుధవారం ఆమె పల్లె ప్రగతిలో భాగంగా కొత్తపేట, లక్ష్మీ పురం తండా, దూదుపల్లిల్లో పర్యటించి సర్పంచులకు పలు సూచనలు చేశారు. గ్రామాల అభివద్ధి ధ్యేయంగా సర్పంచులు కషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రనాథ్, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-ఎల్కతుర్తి
పల్లె ప్రగతి పనులను ఎంపీపీ మేకల స్వప్న, ఎంపీడీవో తూర్పాటి సునీత బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలో మంగళవారం రాత్రి సంబంధిత అధికారులు పల్లెనిద్ర చేశారు. అనంతరం దళితవాడ శ్మశాన వాటిక, హరితహారం నర్సరీ, తదితర పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిరంజన్ రెడ్డి, ఎంపీటీసీ కడారి రాజు, ఎంపీఓ వినీత, ఉప సర్పంచ్ శ్వేత వేణుగోపాల్ పాల్గొన్నారు.
నవతెలంగాణ -మహాముత్తారం
మండంలోని పోలారం, స్థంభంపల్లి పీపీ, యామన్‌పల్లి, స్థంభంపల్లి పీకే, సింగారం గ్రామాల్లో బుధవారం పల్లెప్రగతిలో భాగంగా రోడ్లుకిరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా స్థంభంపల్లి(పీకే), సింగారం గ్రామాల్లో పనులు పెండింగ్‌లో ఉన్నందున సర్పంచ్‌లకు ప్రత్యే అధికారి సుధీర్‌కుమార్ నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సుధీర్‌కుమార్, జెడ్పీటీసీ లింగమల్ల శారద, ఎంపీటీసీ పుట్టపాక రాధ, ఎంపీడీఓ పెద్ది అంజనేయులు, తహశీల్దార్ సతీశ్‌కుమార్, మండల పంచాయతీ అధికారి ఆర్ ఉపేంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తి అయ్యేలోపు అన్ని రకాల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నవతెలంగాణ-పలిమెల
పల్లెప్రగతిలో భాగంగా బుధవారం పంకెనలో స్పెషల్ ఆఫీసర్ శశిధర్, ఎంపీడీఓ ప్రకాశ్, సర్పంచ్ బొచ్చు శ్రీనివాస,్ ఆధ్వర్యంలో మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, ఏపీఓ నాగేంద్ర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు
నవ తెలంగాణ-నల్లబెల్లి
లేంకాలపల్లిలో నిర్వహించిన పల్లెప్రగతిలో పంచాయతీ అధికారి కూచన ప్రకాష్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల లక్ష్మి సాంబయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ పాల్గొన్నారు.
మండలంలోని కొండాపురం, గోవిందాపురం గ్రామాల్లోని పల్లె ప్రకతి వనాలను మండల ప్రత్యేక అధికారి ఉషాదయల్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకతి వనాలు పల్లెలకు అందాన్ని తెచ్చాయన్నారు. పకృతి వనాలలోకి జంతువులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీసీ సురేష్ కుమార్, ఎంపీఓ కూచన ప్రకాష్, సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ- కోల్ బెల్ట్:
స్థానిక 17వ వార్డు సుబాష్కాలనీలో కౌన్సిలర్ ముంజంపల్లి మురళీదర్ ఆధ్వర్యంలో పట్టణప్రగతిలో భాగంగా కాలనీలో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అర్బన్ బీసీ సెల్ అధ్యక్షుడు కట్ట నరసింహ చారి, నాయకులు బాలరాజు, పోషం, వార్డు ఆఫీసర్ సామంతుల నిర్మల తదితరులు పాల్గొన్నారు.