Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్
నవతెలంగాణ-జనగామ
గొర్రెల పంపిణీలో అవినీతికి ఆస్కారం లేకుండా గొల్ల కురుమలకు నగదు బదిలీ చేసి, వారికి నచ్చిన చోట ఇష్టమొచ్చిన గొర్రెలు కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వాలని జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ డిమాండ్ చేశారు. బుధవారం జనగామలోని సంఘం ఆఫీసులో దయాల నర్సింహ్మ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో రవీందర్ మాట్లాడారు. గొర్రెల పంపిణీలో 50శాతం మందికే ఇచ్చి గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం అర్ధాంతరంగా పథకాన్ని నిలిపివేశారన్నారు. సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాల ఫలితంగా రెండు నెలల క్రితం తిరిగి ప్రారంభించారన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో కూడా రూ.3వేల కోట్లు కేటాయించారని, కానీ కరోనా పేరుతో మళ్లీ నిలిపివేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25వేలమంది డీడీలు తీసి మూడేండ్లుగా వేచిచూస్తున్నారన్నారు. గతంలో ఇచ్చిన యూనిట్లలో పశువైద్యులు మధ్య దళారీలతో కుమ్మక్కై యూనిట్ కు 21 గొర్రెలకు బదులు 9 నుండి 13 వరకే పంపిణీ చేసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు తెలిపారు. రేపటి నుంచి పదిరోజులపాటు సంఘం ఆధ్వర్యంలో బందాలుగా రాష్ట్రంలోని అన్ని పశువైద్యశాలలను సందర్శించి అక్కడి సమస్యలను అధ్యయనం చేయాలన్నారు. మందుల కొరత, పశు వైద్య సిబ్బంది పనివిధానం వెలుగులోకి తేవాలని నిర్ణయించినట్టు తెలిపారు. సంఘం రాష్ట్ర తతీయ మహాసభలు ఆగస్టు రెండోవారంలో వరంగల్ లో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కిల్లె గోపాల్, రాష్ట్ర సలహాదారు కాసాని ఐలయ్య, రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మేకల నాగేశ్వరరావు, కాడబోయిన లింగయ్య, బొల్లం అశోక్, సాదం రమేష్, మద్దెపురం రాజు, కాట్రాల తిరుపతి, పరికి మధుకర్, కావటి యాదగిరి, ఎక్కలదేవి కొమురయ్య, బారి మల్సూర్, కాల్వ సురేష్, చేపూరి ఓదేలు, కడెం లింగయ్య, కొమ్మనబోయిన శ్రీనివాస్, పయ్యావుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.