Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
దళితుల సాధికారతే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. చిల్పూర్ మండలంలోని లింగంపల్లి గ్రామం లో మంగళవారం దళితకాలనీలో ఎమ్మెల్యే పల్లెనిద్ర చేశారు. దళితుల స్థితిగతులను తెలుసు కునేందుకు బుధవారం ఉదయం లింగంపల్లిలోని దళితవాడలో పాదయాత్ర చేస్తూ, ప్రతీ ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మును పెన్న డూ లేనివిధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కరోనా కష్ట కాలంలో సైతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతినెల గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు చేస్తు న్నారన్నారు. తద్వారా జమైన నిధులను కోటి రూపాయల వరకు కూడా సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ ఆమోదంతో గ్రామంలో అభివద్ధి పనులు చేసుకోవచ్చన్నారు. దళిత వాడల్లో ఇండ్లు లేని వారికి అదనపు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తానని, సీసీ రోడ్ల నిర్మాణానికి కోటి రూపాయలు, అసంపూర్తి దశలో ఉన్న ఎస్సి కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణా నికి రూ.3 లక్షలు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. రూ.1200 కోట్లతో నియోజవర్గానికి 100 కుటుంబాలకు ప్రతి లబ్ధిదారుడికి రూ.10లక్షలు అందించే భాగంలో దళిత సాధికారత పథకం ద్వారా భూమి లేని నిరుపేదలకు, ఉన్నత విద్య నభ్యసించి నిరుద్యోగ యువతకు వర్తించేలా రూపకల్పన చేయ నున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి, జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ మారపాక రవి, ఎంపీపీ బొమ్మిశెట్టి సరితబాలరాజ్, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి, డీఆర్డీఓ రాంరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రమణ , సర్పంచ్ ఎదునూరి రవీందర్, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, మండల అధ్య క్షులు గుర్రం వెంకన్న, మండల ఇన్చార్జి పోలేపల్లి రంజిత్‌రెడ్డి, మారబోయిన ఎల్లయ్య, సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి రంగు రమేష్, ఎస్ఎస్సి చైర్మన్ మోతే శ్రీనివాస్, రంగు హరీష్ , రజిత, గ్రామశాఖ అధ్యక్షులు రవి పాల్గొన్నారు.