Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రజా సమస్యల పరిష్కారం ప్రజా పోరాటాలతోనే సాధ్యమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నెమలి నరసయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా సఫాయి కార్మికురాలు సప్పిడి నరసమ్మ ఆధ్వర్యంలో దండోరా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ మందకష్ణ ఆధ్వర్యంలో చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంతో నేడు ప్రజానీకానికి కొన్ని సంక్షేమ పథకాలు నిరంతరాయంగా అందుతున్నాయన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రమేష, డొంక చిన్ని, మాలమహానాడు నాయకులు బోడాసుమన్, ఢిల్లీ భుజంగరావు, ఎమ్మార్పీఎస్ ముఖ్యనాయకులు ఏడుకొండలు, అలెగ్జాండర్ గ్రామపంచాయతీ మహాజన పారిశుధ్య కార్మికుల, ఉద్యోగుల సమాఖ్య జిల్లా నాయకులు సతీష్ మహాజన్ పాలొన్నారు.
ఎస్సీ వర్గీకరణ కోసం రాజీలేని పోరాటం : యాదగిరి స్వామి
పాలకుర్తి : ఎస్సీ వర్గీకరణ కోసం శాంతియుతంగా రాజీలేని పోరాటం చేస్తున్నామని ఎస్సీ వర్గీకరణ ఎమ్మార్పీఎస్ లక్ష్యమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చెరుపెళ్లి యాదగిరి స్వామి అన్నారు. ఎమ్మార్పీఎస్ 27 వ ఆవిర్భావ దినోత్సవం తో పాటు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ 57వ జన్మదినోత్సవాన్ని పురస్క రించుకొని బుధవారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా యాదగిరి స్వామి మాట్లాడుతూ ఏబీసీడీల వర్గీకరణ తోనే దళితులకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణపై చట్ట భద్రత కల్పించేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. అనేక హామీలతో అధికారంలోకి వస్తున్న పాలక పార్టీలు వర్గీకరణ చేయకుండానే మోసం చేస్తున్నాయని ఆరోపించారు. పార్లమెంటు అసెంబ్లీ లలో వర్గీకరణ బిల్లును ఆమోదించి చట్టబద్ధత కల్పించాలని అన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు దండు రామచంద్రు, గంపల నాగరాజు, ఇల్లందుల అశోక్, గాదరి నరసింహారావు, గాయాల సాగర్, సంపత్, యాదగిరి, రహిత తదితరులు పాల్గొన్నారు
ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్బావం
చిన్నగూడూరు : మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో బుధవారం ఎమ్మార్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బరపటి రణధీర్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి చాగంటి రమేష్ పాల్గొని మాట్లాడారు. పీడిత వర్గాల ఆత్మగౌరవ ప్రతీక మాదిగ దండోరా ఉద్యమం అన్నారు. మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం హక్కులకోసం 1994 సంవత్సరం ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఏర్పడిందన్నారు. ఎసీస రిజర్వేషన్ సాధనకు మంద కష్ణ మాదిగ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎమ్మార్పీఎస్ పోరాడుతోందన్నారు. నరేందర్, నాగరాజు, మాంకాళి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండల పరిధి పస్రా గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కష్ణ మాదిగ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పస్రా మెయిన్ రోడ్డు చౌరస్తాలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు మడిపల్లి శ్యాంబాబు ఆధ్వర్యంలో మాదిగ దండోరా జెండా ఆవిష్కరించారు. మంద కష్ణ పుట్టినరోజు సందర్భంగా పస్రా ఎస్సీ కాలనీలో కేకు కట్ చేశారు. ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పంగ శ్రీను దండోరా జెండా ఆవిష్కరించారు. అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కష్ణ, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు తిక్క దుర్గారావు, రాము, భద్రయ్య, యాకోబు, ఎమ్మార్పీఎస్ యువసేన నాయకులు హేమంత్, రాంబాబు, దుర్గ, ప్రశాంత్ పాల్గొన్నారు.
నెల్లికుదురు : ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలను నిర్వహించినట్లు ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు గుండె పాక ఉప్పలయ్య జిల్లా నాయకుడు బీరు యాకయ్య తెలిపారు బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తుల్ల వెంకన్న ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎబిసిడి వర్గీకరణ కోసం ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాలని అన్నారు మన హక్కులను సాధించుకున్న వరకు పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ముందుండి నడిపించారని అన్నారు నేడు కూడా మనమందరం ఐక్యంగా ఉండి ఏబిసిడి వర్గీకరణ అయ్యేంతవరకు మన నాయకుడు పిలుపుమేరకు పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు పెరుమాండ్ల గుట్టయ్య , ఇరుగు అనిల్ వెంకన్న, కడారి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు
లింగాలఘనపురం : దండోరా ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితో సబ్బండ వర్గాల గొంతుకగా పోరాడాలని ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి సందేన రవీందర్ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలో ఎమ్మార్పీఎస్ 27వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం మందకృష్ణమాదిగ జన్మదినాన్ని మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు నల్ల లాజర్, నేతలు గండి సురేష్ మాదిగ, వీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం అంజయ్య, ఎంఎంఎస్ అధ్యక్షురాలు కానుగంటి కవిత, వీహెచ్పీఎస్ తిప్పారపు బాలయ్య పాల్గొన్నారు.
తొర్రూరు : సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన కోసం జాతీయ స్థాయిలో విస్తరించిన ఎమ్మార్పీఎస్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని మండల శాఖ అధ్యక్షుడు వెల్దురి పూర్ణ రామ్ చందర్ అన్నారు. బుధవారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ బీసీడీ ివర్గీకరణ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సహకరించకపోవడం దురదష్టకరమన్నారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్య పోరాటాల ద్వారానే వర్గీకరణ సాధించుకుందామన్నారు. ఎంఈఎఫ్ కో-అర్డినేటర్ నకరకంటి వెంకన్న, బచ్చలి వెంకన్న , ఉపాధ్యక్షుడు పందుల మధు , బందు శ్రీను, ప్రధాన కార్యదర్శి డోనుక రాంమూర్తి, పట్టణ అధ్యక్షుడు మంగళపెల్లి శోభన్, మంకాళిజగన్, వెంకటరమణ , ఏర్పుల జితేందర్ తదితరులు పాల్గొన్నారు.