Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- ఉయ్యాలవాడలో సంతాప సభ
నవతెలంగాణ-మహబూబాబాద్
మేదలమెట్ల సత్యనారాయణ ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మండలంలోని ఉయ్యాలవాడలో పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం సత్యనారాయణ సంతాప సభ నిర్వహించగా తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథిగా పాల్గొని సత్యనారాయణ చిత్రపటానికి నివాళ్లర్పించి మాట్లాడారు. సోషలిజం, మార్క్సిజం మీదనే దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని చెప్పారు. దాన్ని కచ్చితంగా అమల్లోకి తీసుకొస్తే పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టిందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పు రావాలంటే దేశ, తెలంగాణ ప్రజలు సోషలిజం, మార్క్సిజం సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. సత్యనారాయణ పోరాట స్ఫూర్తి మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు, రాష్ట్ర నాయకులు రాములు, వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నున్న రమణ, శెట్టి వెంకన్న, సీపీఐ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు భాగం హేమంత్, సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సర్పంచ్ నున్న జయలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.