Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
విద్యార్థులకు త్వరలోనే బోధించనున్న బ్రిడ్జి కోర్సుపై ఉపాధ్యాయులు అవగాహన పెంచు కోవాలని ఐటీడీఏ అకాడమిక్ కమ్యూనిటీ మొబి లైజేషన్ ఆఫీసర్ (ఏసీఎంఓ) ఈర్ప సారయ్య కోరారు. మండలంలోని కర్లపల్లి ప్రభుత్వ గిరి జన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయు లకు గురువారం నిర్వహించిన అవగాహన, శిక్ష ణా కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు కల్తీ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఎంఈఓ గొంది దివాకర్, ఇర్ప సారయ్య ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వినేలా చూడాల్సిన బాధ్యత దత్తత తీసుకున్న ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రాధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు ఆన్లైన్ తరగతుల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో భాగంగా రోజూ ఫోన్ చేసి విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వినేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ నగర్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు యాకలక్ష్మీ, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ యాలం ఆదినారాయణ, సీఆర్పీలు కంటెం రవికుమార్, పాయం వెంకటయ్య, తదితరుల పాల్గొన్నారు.