Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనుల పురోగతి మందగమనం
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌ను నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. గత కమిషనర్ పమేలా సత్పతిని యాదాద్రి భువనగిరి జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ చేశాక ఆమె స్థానంలో ఎవ్వరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించే దిక్కు లేకుండా పోయింది. గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ నగర పర్యటనలో కలెక్టరేట్‌తోపాటు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పాలన భవనాన్ని ప్రారంభించారు. నూతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో త్వరగా మున్సిపల్ కమిషనర్‌ను నియమిస్తారని భావించినా ఆ దిశగా చర్యలు చేపట్టపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే వరద పోటెత్తె అవకాశముంది. కీలకమైన నాలాల విస్తరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణాల కొన్ని పనులు టెండర్లు పిలవకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. వెంటనే కమిషనర్‌ను నియమిస్తే తప్ప పనులు వేగవంతమయ్యే అవకాశం లేదు.
గ్రేటర్ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతిని ఆకస్మికంగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి పదోన్నతిపై యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియమించగా, నాటి నుండి నేటి వరకు 'గ్రేటర్' వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా పమేలా సత్పతి స్థానంలో ఎవ్వరినీ నియమించలేదు. వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకే ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్‌కు వుండే పని ఒత్తిడి నేపథ్యంలో నగరంలో జరుగుతున్న పనులపై దృష్టి సారించడం కష్టసాధ్యంగా మారింది. దీంతో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మందకోడిగా సాగుతున్నాయి. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు ముందుగానే మున్సిపల్ కమిషనర్ వస్తారని ఆశించినా నేటికీ నియామకం జరుగకపోవడం చర్చనీయాంశం గా మారింది. గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు ముందు వరద ముంపును నియంత్రించడానికి పలు రిటైనింగ్ వాల్ 'గ్రేటర్' కమిషనర్ నియామకంలో జాప్యం
నిర్మాణాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇందులో పలు పనులు నేటికీ ప్రారంభం కాలేదు. పలు పనుటకు టెండర్లను సైతం పిలవలేదు. అంతేకాకుండా స్మార్ట్ సిటీ, అమృత్, హృదరు పనులు వేగంగా సాగడం లేదు. దీంతో నగర అభివృద్ధి కుంటుపడే అవకాశముంది. ఇప్పటికైనా ఐఎఎస్ అధికారిని మున్సిపల్ కమిషనర్‌గా నియమించాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ఇప్పటికే కమిషనర్‌గా పనిచేసిన పమేలా సత్పతి బదిలీ అయి నెలరోజులు కావస్తున్నా, నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోవడంతో బల్దియా పాలన గాడి తప్పే ప్రమాదముంది.
తీవ్ర జాప్యం..?
ఈనెల 21న వరంగల్ నగరంలో సీఎం కేసీఆర్ పర్యటించి వెళ్లిన విషయం విదితమే. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ నియామకం జరుగుతుందని అందరూ భావించారు. దీనికి భిన్నంగా నేటికీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. అంతకుముందు సీఎం కేసీఆర్ నగర పర్యటన కంటే ముందే మున్సిపల్ కమిషనర్‌ను నియమిస్తారని ప్రచారం జరిగింది. అయినా అది వాస్తవరూపం దాల్చలేదు. మంత్రి కేటీఆర్ ఐఎఎస్ అధికారిని నియమించే అవకాశమున్నట్లు టిఆర్ఎస్లో ఒక వర్గంలో ప్రచారంలో వుండగా, పలువురు నేతలు నాన్ ఐఎఎస్ అధికారిని కమిషనర్‌గా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఐఎఎస్ అధికారి కమిషనర్‌గా వస్తే తమ మాట వినదని భావిస్తున్న అధికార టిఆర్ఎస్ నేతలు నాన్ ఐఎఎస్ అధికారిని కమిషనర్‌గా తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో 'కుడా'లో పనిచేసిన ఒక నాన్ ఐఎఎస్ కేడర్ అధికారిని కమిషనర్‌గా తెచ్చుకోవాలని అధికార టిఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం ఎలా వున్నా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం మున్సిపల్ కమిషనర్‌ను నియమించే విషయం సిఎం, మున్సిపల్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంలో వైఫల్యం వుంది.