Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
దేశ , రాష్ట్రవ్యాప్తంగా, ప్రజలు ఆయిల్, స్వీట్, బర్గర్, ఐస్‌క్రీమ్, తదితర కల్తీ ఆహారం అని తెలిసి కూడా తింటుండంతో చిన్న వయసులోనే అనా రోగ్యాలకు గురవుతున్నారని, జిల్లా ప్రజలు ఆరోగ్యం గా ఉండేందుకు వాకింగ్‌తో పాటు వ్యాయామం దోహదపడుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు, గురువారం జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో మాజీ కౌన్సిలర్ భరత్కుమార్చారి ఆధ్వర్యంలో ఆధునాతన టెక్నాలజీతో ఏర్పాటుచేసిన ఛాంపియన్ జిమ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాలానికి అతీతంగా ప్రజలు తమ దిన చర్యలు మార్చుకున్నపుడే ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతారని అన్నారు. నిర్వాహకులు మురళి కష్ణ, కో ఆప్షన్ మెంబర్ వజ్రమని పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనమందించాలి
భూపాలపల్లి జిల్లా కేంద్రం కావడంతో ఆయా పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు కాళేశ్వరం వెళ్లే పర్యాటకులకు నాణ్యమైన భోజ నాన్ని అందించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి మున్సిపాలిటీ మంజూరు నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన షేక్ స్పైర్ ఫుడ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ఫుడ్ కోర్టును వ్యాపార నిమిత్తం కాకుండా కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన అల్పాహారం భోజనం అందించాలని సూచించారు. నిర్వాహకులు బోయిన రమేష్, తోట్ల చందు, అజరు యాదవ్ పాల్గొన్నారు.
పట్టణాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దాలి
పట్టణాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి 27వ వార్డులోని హైటెక్ కాలనీ, జవహర్ నగర్‌కాలనీలో నిర్వహి స్తున్న మూడవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. ప్రజలు పట్టణ అభివద్ధిలో భాగస్వాములవ్వాలన్నారు. పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. భూపాలపల్లి సుందర నగరంగా తయారు చేయటమే తమ లక్ష్యమన్నారు.
పేదల అబివృద్ధే టీఆర్ఎస్ లక్ష్యం
పేదల అభివద్ధే టీఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి మండలానికి చెందిన 15మంది లబ్ధిదారులకు రూ.5లక్షల80వేల విలువైన చెక్కులు, గణపురం మండలానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ.లకా92వేల విలువైన చెక్కులు అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గ్గెం వెంకట రాణి సిద్ధూ, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, టౌన్, మండల ప్రెసిడెంట్ సాంబమూర్తి, రవీందర్‌రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ రఘు, పీఏసీఎస్ చైర్మెన్ సంపత్, చైర్మన్ పూర్ణ చందర్ రెడ్డి, చెల్పూర్ సర్పంచ్ మధుసూదన్, ఎంపీటీసీ అశోక్, మలహార్రావు, నాయకులు లక్ష్మీ నర్సింగ రావు, కరుణాకర్ రెడ్డి, మైనార్టీ ప్రెసిడెంట్ ఖరీమ్, కౌన్సిలర్లు హరీష్ రెడ్డి, ఎడ్ల మౌనిక శ్రీను,బద్ధి సమ్మయ్య, తోట్ల సంపత్, హారిక శ్రీనివాస్, నూనె రాజు, కో ఆప్షన్ సభ్యులు వజ్రమణి, కమల, ఇర్ఫాని, నాయకులు రమేష్, తిరుపతి, హరీష్ రెడ్డి, అశోక్, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ సాగర్‌రెడ్డి, తిరుపతమ్మ, భాగ్యలక్ష్మి, భక్త ఆంజనేయ టెంపుల్ చైర్మెన్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.