Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్
సహజ వనరులను అభివద్ధి చేసి రైతులు, ప్రజలకు అందించి వలసల నియంత్రణకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషితో రాష్ట్రంలో వలసలు తగ్గాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతు వేదికలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. పంటను వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసు కోవాలన్నారు. సాగు నైపుణ్యాలపై రైతు వేదికలో చర్చించుకుని అవగాహన పెంచుకోవాలని సూచిం చారు. అనంతరం ఆత్మకూరు గ్రామంలో ఊరి మధ్యలో ఉన్న మురికి కాలువ సమీప ప్రజలు దుర్వాసనతో బాధపడుతున్నారని సర్పంచ్ పర్వతగిరి రాజు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే డ్రైనేజీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఆత్మకూర్ అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ అధికారులు ఉదయం 9గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రైతులకు అందుబాటులో ఉండాలని కోరారు. వ్యవసాయ అధికారులు రైతులు వేసిన పంటలు తెలుసుకొని రికార్డు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాధిక, ఎంపీపీ సుమలత, సర్పంచ్ పర్వతగిరి రాజు, పీఏసీఎస్ చైర్మెన్ ఎరుకొండ రవీందర్, ఏఎంసీ చైర్మెన్ కాంతాల కేశవరెడ్డి, ఎంపీడీవో నర్మద, వ్యవసాయ విస్తరణ అధికారి యాదగిరి, ఉపసర్పంచ్ స్వాతి భగవాన్ రెడ్డి పాల్గొన్నారు.
అందుబాటులో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మిషన్లు
పరకాల రూరల్ : కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మిషన్లు పరకాలలో అందు బాటులో ఉంటాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా రెడ్ క్రాస్ వారు అమెరికా తెలుగు సంఘం సౌజన్యంతో మిషన్లను అందుబాటులోకి తెచ్చినందుకు ఐఆర్సీస్ వారికి అభినందనలు తెలిపారు. ఈ మిషన్లు రెడ్ క్రాస్ వారి జెనరిక్ మెడికల్ షాప్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కరోనా కష్టకాలంలో తలసేమియా పేషంట్ల కోసం కృషి ిచేసిన రెడ్ క్రాస్ సేవలు మరవలేనివన్నారు. పరకాల పట్టణంలో బ్లడ్ బ్యాంకు నిర్మాణానికి స్థలం కేటాయించినట్టు తెలిపారు. త్వరలోనే బ్లడ్ బ్యాంకు నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. ఇండియన్ రెడ్ క్రాస్ రూరల్ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు, కమిటీ సభ్యులు డాక్టర్ పి రాజేశ్వర ప్రసాద్, బండి సారంగపాణి ,మున్సిపల్ చైర్మెన్ సోదా అనిత రామకృష్ణ, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.