Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
పల్లెప్రగతి కార్యక్రమములో భాగంగా బుధవారం రాత్రి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మండలకేంద్రం వేలేరులోని దళిత కాలనీలో పల్లె నిద్రచేసారు. ప్రజలతో మమేకమై దళితకాలని సమస్యలు తెలుసుకున్నారు. ఎంపీపీఎస్ వేలేరు పాఠశాలకు సంబంధించిన సమస్యలపై ఉపాధ్యాయులు గురువారం ఎమ్మెల్యేను కలిసి పాఠశాలలో తరగతి గదులు తొమ్మిదింటికి రూప్ ఫ్లోరింగ్ చేయాలని, పాఠశాల మధ్య నుండి వెళ్తున్న కరెంట్ హైటెన్షన్ వైర్ లైన్ తీసివేయాలని, పాఠశాలలో బాలబాలికలకు టాయిలెట్స్ మంజూరు చేయాలని విన్నవించారు. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, రాజేందర్, విద్యా కమిటీ చైర్మెన్ సాంబరాజు, సర్పంచ్ మాధవ రెడ్డి, ఎంపీపీ సమ్మిరెడ్డి, ఎంపీడీఓ రవీందర్, కుడా డైరెక్టర్ బిల్లా యాదగిరి, సీఆర్పీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
వడ్డెరలకు పునరావాసం కల్పించాలని వినతి
వడ్డెర కుల సంఘానికి చెందిన సుమారు 15 కుటుంబాలు వేలేరు ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ అధ్వర్యంలో ఎమ్మెల్యే రాజయ్యను కలిసి సమస్యల్ని విన్నవించారు. మండల కేంద్రం వేలేరు సిద్దయ్య కుంటను ఆనుకొని ఉన్న స్థలంలో కట్టుకున్న ఇండ్లను వదిలి వెళ్లాలని అధికారులు ఇటీవల ఆదేశాలు జారీ చేశారన్నారు. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలని, నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. వేలేరు లో ఎక్కడైనా పునరావాసం కల్పిస్తే ఇండ్లు ఖాళీచేసి వెళ్ళిపోతామన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల హామీని స్వాగతిస్తున్నామని, కానీ, ఇండ్లను తీసి వేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు కుమార్, రాజు, రాజయ్య,మల్లయ్య, సమ్మయ్య, రమేష్, కొమురమ్మ, లలిత, తదితరులు పాల్గొన్నారు.