Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోటి రూపాయలతో 6 ఉపవైద్య కేంద్రాలు
- డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
నవతెలంగాణ-మరిపెడ
సమాజంలోని ప్రతిఒక్కరూ మొక్కలను నాటి పల్లెలకు పచ్చతోరణం కట్టా లని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కోరారు. మండలంలోని చిల్లంచెర్ల, అనేపురం, అబ్బాయిపాలెం, గాలివారిగూడెం, బోడ అమృతండాల్లో కోటి రూపా యల వ్యయంతో ఏర్పాటు చేసిన 6 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను గురు వారం ఆయన ప్రారంభించారు. పల్లె ప్రకతి వనాలను, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి పరిరక్షించి పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలా చూడాలని కోరారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్‌రావు, ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు నాయక్, జెడ్పీటీసీ తేజావత్ శారద రవీందర్, సొసైటీ చైర్మెన్ చాపల యాదగిరిరెడ్డి, మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకన్న, తాళ్లపెల్లి రఘు, టీఆర్ఎస్ నాయకులు నారెడ్డి సుదర్శన్‌రెడ్డి, కవితారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ : మండలంలోని ఎర్రకుంట తండా, దామరవంచ, సక్రు తండా, జగ్గు తండా, ఏపూరు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను, పారిశుధ్య పనులను జెడ్పీ సీఈఓ అప్పారావు, డీఆర్డీఓ సన్యాసయ్య పరిశీలించి మాట్లాడారు. లక్ష్మీపురం, తాళ్లపటితండా గ్రామ పంచాయతీల్లో మండల స్పెషల్ ఆఫీసర్ చత్రు నాయక్ పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మీ, ఎంపీఓ ప్రసాదరావు, ఈజీఎస్ ఏపీవో బన్సీలాల్, తదితరులు పాల్గొన్నారు.
ములుగు : మండలంలోని కొడిశలకుంట, మాన్సింగ్ తండా, గుర్తూరు తండా, మొదుఉదనూర్ తండా పంచాయతీల్లో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ పర్యటించారు. మొక్కలు నాటి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు గుగులోత్ తిరుపతి, మంజుల యాకూబ్, ఎంపీటీసీ లాలు, నాయకులు తరుణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు వీరారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మందాడి పుష్ప, దార కిరణ్, పోలెపాక స్వామి, మొగిలి, గౌస్, రావుల సంపత్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, పర్ల శ్రీనివాస్, తల్లా మొగిలి, కుసుమ రమేష్, తదితరులు పాల్గొనారు.బయ్యారం : మండలంలోని కాచనపల్లిలో డంపింగ్ యార్డ్, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలను జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు పరిశీలించారు. అభివద్ధి కార్యక్రమాలపై ఎంపీడీఓను అడిగి సూచనలు అందించారు. అనంతరం వైకుంఠధామం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో ముడిగా వజ్జయ్య, ఉపసర్పంచ్ పాండు, డీఎల్పీఓ నారాయణ, ఎంపీడీఓ చలపతిరావు, ఎంపీఓ పద్మ, పీఆర్ ఏఈ రాజశేఖర్, మిషన్ భగీరథ ఏఈ శ్రీజ, ఎలక్ట్రికల్ ఏఈ సతీష్, పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు 12వ వార్డులో పర్యటించారు. ఖాళీ స్థలాల యజమానులు ప్లాట్లలో నీరు నిల్వకుండా చూసుకోవాలని చెప్పారు. ఖాలీ ప్లాట్ల యజమానులకు నోట ీసులు అందజేశారు. నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేశారు. మండలంలోని కర్కాల గ్రామంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, తదితరాలను జెడ్పీ ఫ్లోర్‌లీడర్, జెడ్పీ టీనీ మంగళపల్లి శ్రీనివాస్, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య పరిశీలించి మాట్లా డారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రవీందర్, ఎంపీడీఓ భారతి, ఎంపీఓ గౌస్, ఎంపీటీసీ వల్లపు గోపమ మల్లయ్య, ఉపసర్పంచ్ పసులాది వెంకన్న పాల్గొనగా 1వ వార్డులో నీటి నిల్వ గుంటల్లో కౌన్సిలర్ భూసాని రాము ఆయిల్ బాల్స్ వేసి మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పట్ల అమ్రపత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు స్పెషలాఫీసర్ ఎడ్ల శ్రావణి, ఆర్పీ ధనలక్ష్మీ, కాంగ్రెస్ నాయకుడు నల్లపు రాజు, తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర మండలంలో.. ముత్యం తండాలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి పల్లె ప్రగతి పనులను పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ ధరావత్ భీమా నాయక్, ఎంపీఓ యాకయ్య, ఎంపీటీసీ ఎర్ర సబిత వెంకన్న, ఏఈఓ ప్రవళిక, ఉపసర్పంచ్ గుగులోతు రవి, పంచాయితీ కార్యదర్శి సురేందర్ నాయక్, వార్డు సభ్యులు భూక్య భీక్ నాయక్, భూక్య పూలమ్మ, ధారవత్ లచ్చమ్మ పాల్గొన్నారు.
తొర్రూర్ టౌన్ : మండలంలోని అమ్మాపురంలో సర్పంచ్ కడెం యాకయ్య ఆధ్వర్యంలో జంగాల కాలనీలో పర్యటించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడారు. జీకే తండా, క్వారీ రోడ్డుల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణి, ఏఎన్ఎం కమల, తమ్మెర విశ్వేశ్వర్రావు, హెల్పర్ రమేష్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పాలకుర్తి : మండలంలోని తీగారం గ్రామాన్ని అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సందర్శించి ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, ఎంపీడీఓ వనపర్తి అశోక్‌కుమార్‌తో కలిసి పల్లె ప్రగతి పనులను పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ పోగు రాజేశ్వరి శ్రీనివాస్, ఎంపీఓ దయాకర్, పంచాయతీ కార్యదర్శి సుజాత, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
గార్ల : ముల్కనూరు పంచాయతీలో తడి, పొడి చెత్త బుట్టలను ప్రదర్శిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వట్టం జానకీరాణి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీఓ కిషోర్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నగూడూరు : మండలంలోని గుండంరాజుపల్లి గ్రామంలో డీపీఓ రఘువరన్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కాలనీలో పరిసరాలను పరిశీలించారు. చెత్త వేరు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, కారోబార్ సత్యహరి, తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లి : మండల కేంద్రంలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు పోకల శివకుమార్ గుప్తా మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హసీం, గ్రామ కార్యదర్శి సాంబయ్య, వార్డు సభ్యులు నీలం వాసు, తదితరులు పాల్గొన్నారు.
కొడకండ్ల : మండలంలోని మొండ్రాయి గిరి తండా పంచాయతీ పరిధిలోని స్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్, పల్లె ప్రకృతి వనాన్ని జెడ్పీ సీఈఓ విజయలక్ష్మీ పరిశీలించి మాట్లాడారు. సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు, ప్రజలకు సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పెరుమాండ్ల ఊర్మిళ రాజేష్ నాయక్, ఇన్‌ఛార్జి ఎంపీడీఓ దైవాదీనం, ఏపీఓ నరిగె కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి సతీష్, తదితరులు పాల్గొన్నారు.