Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని అభివృద్ధి ప్రదాతగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి అభివర్ణించారు. నియోజకవర్గ కేంద్రంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షుడు బెలిదె వెంకన్న ఆధ్వర్యంలో గురువారం కడియం శ్రీహరి 70వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి, నరేందర్‌రెడ్డి మాట్లాడారు. పేద కుటుంబంలోంచి రాజకీయాల్లోకి వచ్చి బడుగులకు ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థను కడియం బలోపేతం చేశారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేండ్లపాటు మంత్రిగా విశేష కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జగన్మోహన్రెడ్డి, నాయకులు కేశిరెడ్డి మనోజ్‌రెడ్డి, బూర్ల శంకర్, తెల్లాకుల రామక్రిష్ణ, పురుమాని రజాక్, రాపోలు మధుసూదన్‌రెడ్డి, స్వామినాయక్, పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, ఉద్దేమారి రాజ్‌కుమార్, ఉప్పల స్వామి, నాగరబోయిన యాదగిరి, కోతి రాములు, ఇనుగాల రాజిరెడ్డి, బెలిదె సతీష్, లోడెం రవీందర్, సనాది రాజు, ఆకుల నర్సయ్య, ఎర్రబెల్లి చేరాలు, బూరు నరేందర్, ఇసాక్, సాదం మల్లేష్, పొన్న రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
లింగాలఘనపురం : ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కడియంను కలిసిన వారిలో చిట్ల భూపాల్‌రెడ్డి, రాజు, శంకరయ్య, వంగ నాగరాజు, నర్సిరెడ్డి, సుధీర్, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, నర్సింహులు, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.