Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.50 లక్షల వ్యయంతో ఆనందయ్య మందు పంపిణీ
- టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సీతారాములు, పీఏసీఎస్ చైర్మెన్ హరిప్రసాద్‌రావు
నవతెలంగాణ-తొర్రూరు
ప్రజారోగ్య పరిరక్షణే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, పీఏసీఎస్ చైర్మెన్, డీసీసీబీ డైరెక్టర్ కాకిరాల హరి ప్రసాద్‌రావు తెలిపారు. మంత్రి దయాకర్‌రావు చొరవతో ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి తెప్పించిన రూ.50 లక్షల విలువైన ఆనందయ్య మందును పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్‌లతో కలిసి విలేకరులకు, నాయకులకు, పట్టణ ప్రజలకు సీతారాములు, హరిప్రసాద్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతారాములు, హరిప్రసాద్ మాట్లాడారు. కరోనాను నియంత్రించడంలో ఆనందయ్య మందు విజయవంతమైన క్రమంలో పాలకుర్తి నియోజకవర్గ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మంత్రి దయాకర్‌రావు ప్రత్యేకంగా తెప్పించారని చెప్పారు. కరోనా వచ్చిన, రాని గర్భిణులు, చిన్న పిల్లలు మినహా అందరూ ఆనందయ్య మందును తెల్లవారుజామున పరిగడుపున, సాయంకాలం భోజనానికి వాడవచ్చని తెలిపారు. ఆనందయ్య మందు కు ఆయుష్ అధికారులు సైతం అనుమతి ఇచ్చిన విషయం గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, వైస్ చైర్మెన్ సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాసరావు, నాయకులు కుర్ర శ్రీనివాస్, రారు శెట్టి వెంకన్న, జూరెడ్డి రవీందర్‌రెడ్డి, ఎర్ర సంపత్, తదితరులు పాల్గొన్నారు.