Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
గుండ్లవాగు ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో వెంకన్న అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా వెంకట్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తై పదేండ్లు గడచినా ప్రభుత్వం స్వాధీనపర్చుకోవడం లేదని, ప్రాజెక్టు అభివద్ధి కొరకు నిధులు కేటాయించడం లేదని తెలిపారు. ప్రాజెక్టు కాల్వల్లేక పొలాలకు నీరు అందడం లేదని చెప్పారు. రైతులు సొంత ఖర్చులతో కాల్వలకు మరమ్మతులు చేసుకుంటున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును సాకుగా చూపుతూ గుండ్లవాగు ప్రాజెక్టుకు, లక్నవరం కాల్వలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రంగాపూర్‌లో రెవెన్యూ భూమిలో పట్టాలిచ్చిన రైతులు ఇందిరా జలప్రభ కింద బోర్లు మంజూరు కాగా విద్యుత్ అధికారులు లైన్ వేస్తుంటే అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు. రెవెన్యూ భూముల్లో అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం దారుణమన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పులిగుజ్జు వెంకన్న, పొదిల చిట్టిబాబు, గుండు రామస్వామి, సూర్యనారాయణ, సామ చంద్రారెడ్డి, అంబాల సాంబయ్య, గంగదారి స్వరూప, కాప కోటేశ్వర్రావు, గొంది రాజేష్, తదితరులు పాల్గొన్నారు.