Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ కలెక్టర్ హరిసింగ్
నవతెలంగాణ-శాయంపేట
'గ్రామాలకు వస్తున్నారు పోతున్నారు, పారిశుధ్య పనులపై పర్యవేక్షణ లేదు. సర్పంచ్, పంచాయతీ కార్యద ర్శులతో పారిశుధ్య పనులు చేయించేలా చూడాలి.' అని ఎంపీవో రంజిత్కుమార్పై అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అసహనం వ్యక్తం చేశారు. శాయంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం రాత్రి జెడ్పీ సీఈఓ రాజారావు, ఎంపీడీవో కష్ణమూర్తి లతో కలిసి అడిషనల్ కలెక్టర్ పల్లెనిద్ర చేశారు. గురువారం ఉదయమే గ్రామంలోని వీధులను కాలినడకన తిరుగుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. పందులను బయట తిరిగ నివ్వవద్దని ఎరుకల కులస్తులకు అధికారులు తెలియజేయడంతో, తాము వాటిపైనే ఆధారపడి జీవిస్తున్నామని, తమకు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు, సబ్సిడీ రుణాలు అందడం లేదని అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఇందిరాగాంధీ హయాంలో నిర్మించిన ఇంది రమ్మ క్వార్టర్స్ కూలిపోయి ఉండడాన్ని పరిశీలించారు. సంబంధిత యజమానులతో మాట్లాడి స్థలాల్లో మొక్కలు నాటించాలని ఎంపీడీవో కష్ణమూర్తిని ఆదేశించారు. విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంగణంలో ఖాళీ స్థలం ఉండడంతో హరిత హారంలో రెండువేల మొక్కలు నాటాలని ఆదేశిం చారు. నీటి వసతి లేదని ఏఈ రాజమౌళి అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన మిషన్ భగీరథ పైప్లైన్ వేసి నీటి సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పత్తిపాక రోడ్డు నుండి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కొరవడిందని అన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ లో పనులు చేస్తున్నప్పటికీ ప్రజలు భాగస్వామ్యం లేకపోవడంతో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ బాటిల్ లు ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయని అన్నారు. గ్రామ పంచాయతీ అందజేసిన చెత్త డబ్బాలలోనే చెత్తను వేయాలని సూచించారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పారిశుద్ధ్య పనులు చేయకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ బాగా లేదని అన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో రాజారావు, ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి, ఎంపీవో రంజిత్ కుమార్, సర్పంచ్ కందగట్ల రవి, ఉప సర్పంచ్ సుమన్, పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డి పాల్గొన్నారు.