Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కరోనా కష్టకాలంలో ఆదుకోవడానికి పేద కుటుం బాలకు చెందిన ఒక్కో వ్యక్తికి 10కిలోల సన్న బియ్యం పంపిణీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్ డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ దేశంలో కరోనా బారినపడి ప్రజలు అనేక ఇబ్బందుల పాలవుతుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేవలం ఆహార భద్రత కార్డుదారులకు మాత్రమే 5కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తుందన్నారు. వీటితో పాటు తెల్లరేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం 5కిలో బియ్యం ఇస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఒక్కో వ్యక్తికి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి చేతులెత్తయడం సరైంది కాదన్నారు. కిందటి నెల వరకు సన్న బియ్యం పంపిణీ చేయగా పేదలు కొంతమేరకు ఊరట చెందారని తిరిగి ఎప్పట్లాగే ఈ నెల దొడ్డు బియ్యం పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే రేషన్ కార్డుదారులందరికి 10కిలోల సన్న బియ్యం ఉచితంగా అందజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుంపెల్లి మునీశ్వర్, అక్కపెల్లి రమేష్, జిల్లా నాయకులు గోవర్థన్ మియాపురం, పాల కవిత, మండల కార్యదర్శి గడ్డం యాకయ్య, యశోద, శైలజ, మంజుల, శ్రీకళ, స్వామి, ఇల్లందుల సాంబయ్య, బాలనర్సయ్య, వినోద్ తదితరులు పాల్గొన్నారు.