Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూడెమోక్రసీ నాయకులు
నవతెలంగాణ-ఖిలా వరంగల్
సామాజిక, హక్కుల కార్యకర్త ఫాధర్ స్టాన్‌స్వామి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి ఆరెల్లి కృష్ణ, జిల్లా నాయకులు గంగుల దయాకరÊ, బండి కోటేశ్వర్‌రావులు అన్నారు. గురువారం ఖిలా వరంగల్ పెట్రోల్ పంపు సెంటర్లో రాచర్ల బాలరాజు అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు నిరసనగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్టాన్‌స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 83ఏండ్ల వయస్సున్న స్టాన్‌స్వామిని భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేసి 9నెలలు జైల్లోనే ఉంచారన్నారు. వయస్సు పైబడిన ఆయనకు బెయిల్ రాకుండా ఎన్ఐఏ చేసిందని, దీంతోనే ఆయన అనారోగ్య కారణాలతో మృతిచెందాడని తెలిపారు. కేసులున్న అనేక మంది బెయిల్‌పై వచ్చి రాష్ట్రాలను పాలిస్తున్నారని, కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న వారికీ బెయిల్ రాకుండా చేయడం సమంజసం కాదన్నారు. భీమా కోరేగావ్ కేసులో నిందితులుగా జైల్లో మగ్గుతున్న సాయిబాబా, వరవరరావులతో పాటుగా మిగిలిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలన్నారు. ఉపా చట్టాని రద్దు చేయాలన్నారు. స్టాన్‌స్వామి మృతిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఐలయ్య, కృష్ణ, ఎండీ అక్బర్, గద్దల శ్యామ్, ఎల్లయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.