Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుగ్గొండి
పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పలు గ్రామాలను వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం హరిత సందర్శించారు. మండలంలోని శివాజీనగర్, నాచినపల్లి, పొనకల్, లక్ష్మీపురం గ్రామాలను సందర్శించి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిపనులను పర్యవేక్షించారు. పల్లె ప్రకృతి వనాలను పరిశీలించి మొక్కలు నాటి ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, ఆర్డీవో పవన్ కుమార్, ఎంపీడీవో కష్ణ ప్రసాద్, ఏపీవో శ్రీధర్ గౌడ్, వైస్ ఎంపీపీ జైపాల్ రెడ్డి, పీఏసీఎస్్ చైర్మన్ రాజేశ్వరరావు, గ్రామాల సర్పంచులు ఉమా రవీందర్ మమత రాజు, ఊర్మిళవెంకటేశ్వర్లు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రేగొండ : నాలుగో విడత హరితహారంలో భాగంగా గ్రామాలు పచ్చదనంతో సంతరించుకుంటున్నాయని మండల ప్రత్యేక అధికారి సామ్యూల్ అన్నారు. గురువారం మండలంలోని రూపీ రెడ్డిపల్లి, గ్రామాల్లోని చలి వాగు కెనాల్ వద్ద జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. అనంతరం గోరి కొత్తపల్లి గ్రామంలోని సెగ్రీ గేషన్ చుట్టూ బయో పెన్సింగ్ పనులను పరిశీలించారు. అనంతరం తిరుమలగిరి శివారులోని జరుగుతున్న హరితహారం పనులను ఎంపీడీవో సురేందర్‌తో కలిసి పరిశీలించారు. గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు పాల్గొని అబివృద్ధి చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని, సైడ్ డ్రైనేజీ లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి తెలిపారు. సర్పంచులు రాణి మధుసూదన్, రజిత రాజయ్య పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
గణపురం : నాలుగో విడత పల్లె ప్రగతిని ఉపయోగించుకొని గ్రామాబివృద్ధి చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి, జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి అన్నారు. గురువారం ఎంపీడీవో అరుంధతి, ఎంపీఓ రామకృష్ణతో కలిసి ఆయన సీతారాంపురం గ్రామాన్ని సందర్శించారు. పల్లె ప్రగతి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని, గ్రామంలో చెత్త లేకుండా చూడాలని, పైప్ లైన్ లీకేజీలకు మరమ్మతులు చేయించాలని సూచించారు. స్మశాన వాటిక చుట్టూ బయో ఫెన్సింగ్ చేయించాలన్నారు. ఎస్సీ కాలనీని సందర్శించి కావాల్సిన సదుపాయా గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రాథమిక పాఠశాల వద్ద మొక్క నాటారు. చెత్త నుండి సంపద సష్టించాలని గ్రామంలో సేకరించిన చెత్తను షెడ్, ప్లాస్టిక్, సీసాలు ,ఐరన్ చేయాలని తడి చెత్త నుండి వర్మి కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. కార్యదర్శి ముక్కెర హేమంత్, విలేజ్ స్పెషల్ ఆఫీసర్ రాజు, కారోబార్ రాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పలిమెల : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 8వ రోజు గురువారం సర్పంచ్ జువ్వాజి పుష్పలత వాటర్ ట్యాంకులు. బావులలలో క్లోరినేషన్ చేశారు. పరిసరాలు పరిశుభ్రం చేయించారు. స్వయంగా ట్యాంకు ఎక్కి క్లీన్ చేయించి బ్లీచింగ్ ఎంత మోతాదులో కలుపాలో వివరించారు. ఎంపీడీఓ ప్రకాష్ రెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి మిషన్ భగీరథ ఏఈ సాయిరాం, కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు.
కాజీపేట : మడికొండ 46వ డివిజన్ పరిధి దుర్గాభారు స్త్రీ శిశు సంక్షేమ అభిరుద్ది మాహిళా ప్రాంగణంలో పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా నేడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వస్తున్న సందర్బంగా స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్ రావు, ఇంచార్జి ఆఫీసర్ ప్రవీణ్ బాబు గురువారం మహిళ ప్రాంగణాన్ని సందర్శించి హరితహారం మొక్కలు నాటారు. ప్రాంగణం మేనేజర్ జయశ్రీ, టిఆర్ఎస్ నాయకులు ఈదురు.అనిల్ కుమార్, నర్రా.రమేష్, తోట యాదగిరి, మల్లయ్య, బత్తుల .కొమురయ్య పాల్గొన్నారు.
మహాముత్తారం : 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల ప్రత్యేక అధికారి సుధీర్ కుమార్ గురువారం మండల పరిది సింగంపల్లి, కనుకునూరు గ్రామాల్లో పర్యటించారు. స్మశాన వాటిక, హరిత హారం కార్యక్రమాలు పరిశీలించి తగు సూచనలిచ్చారు. కనుకునూరు సింగంపల్లి గ్రామాలలో స్మశాన వాటిక పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మిగిలిన పనులు 10వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు, ఎంపీఓ ఆర్ ఉపేంద్రయ్య, సర్పంచులు స్వరూప, కుడుముల లక్ష్మి, ఏఈఓ పుష్పలత, ఎప్ఎస్ఓ రమేష్, పంచాయతీ కార్యదర్శులు వీరయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట : అమీనాబాద్ గ్రామంలో హరితహారం లో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం స్థలంలో 40 మొక్కలు నాటారు. సంఘ అధ్యక్షుడు మురహరి రవి, డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్, ఉపాధ్యక్షులు పెండ్లి మల్లయ్య, డైరెక్టర్స్ బండి స్వరూప, భూక్య హుస్సేన్, మాదారపు నరసయ్య, అనుముల యకాంతం, దొంతర బోయిన కోమ్మలు, అలవాల శాంతమ్మ, గడ్డల స్వరూప, ముస్కు ఐలయ్య, అనుముల రవి, మల్లాడి వీరారెడ్డి, డీసీసీబీ ఫీల్డ్ ఆఫీసర్ రమేష్ , సంఘ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నార్లపురపు ఎల్లయ్య, సిబ్బంది పులి రమేష్ , అశోక్ పాల్గొన్నారు.
ఎల్కతుర్తి : మండలంలోని ఆరేపల్లి గ్రామ పంచాయతీ లో గురువారం అంగన్వాడి సెంటర్లో హరితహారం కార్యక్రమాన్ని ఎంపీపీ స్వప్న, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అధికారి శారద ప్రారంభించారు. నాటిన మొక్క భావితరాలకు పర్యావరణాన్ని అందిస్తుందన్నారు సర్పంచ్ బూర్గులరామారావు, ఎంపీటీసీ ఇంద్రసేనారెడ్డి, సూపర్వైజర్ విజయ గౌరీ, అంగన్వాడీ టీచర్స్ కరుణ, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : మండలంలోని నవాబుపేట గ్రామం లో నర్సరీ పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటికను డీఆర్డీఓ రుబీనా నారెగా గురువారం సందర్శించి పరిశీలించారు. పనుల నిర్వహణ, రికార్డులను తనిఖీ చేసారు. సర్పంచ్ కసిరెడ్డి సాయిసుధ రత్నాకర్ రెడ్డి, టీఏ సుధాకర్ అపర్ణ, పంచాయతీ కార్యదర్శి సుచరిత, కారోబార్ సత్యనారాయణ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కలు పంపిణీ
నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో గురువారం గ్రామపంచాయతీ పరిధిలోని చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ వినోద వీరారెడ్డి మండల స్పెషలాఫీసర్ శైలజ పాల్గొని ఇంటింటికి మొక్కలు పంపిణీచేశారు. మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎంపీడీవో రవీంద్రనాథ్, తహసీల్దార్ రామారావు, కో ఆప్షన్ సభ్యుడు రాజు మహమ్మద్, ఎంపీటీసీ పద్మ-నరేందర్, మండల ప్రత్యేక అధికారి రఘుపతి, ఎంపీఓ శంకర్రావు, ఇన్చార్జి సర్పంచ పూర్ణచందర్రావు పాల్గొన్నారు.
నడికూడ : నాలుగవ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పులిగిల్ల గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను, స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను డీఎల్పీవో కల్పన గురువారం పరిశీలించారు. ఎంపీఓ అఫ్జల్, స్పెషల్ ఆఫిసర్ వినిశెట్టి బాబు, సర్పంచ్ సదానందం, గ్రామ కార్యదర్శి నరసింగం పాల్గొన్నారు.
నెక్కొండ రూరల్ : మానవాళి మనుగడ పర్యావరణం తోనే ముడిపడి ఉందని, పర్యావరణం పరిరక్షించు కుంటేనే భవిష్యత్తు తరాలకు భద్రత ఉంటుందని అప్పల రావు పేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ అన్నారు నెక్కొండ మండలం అప్పల రావు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సర్పంచ్ వడ్డె రజిత సురేష్ ,కార్యదర్శి నరేష్, పల్లె ప్రగతి గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌తో కలిసి హరితహరం కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పండ్లు, కూరగాయల మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు అవుతుండడం అభినందనీయమన్నారు. టీఆర్ఎస్ నాయకులు సురేష్, గ్రామపంచాయతీ కారోబార్ కిరణ్, సిబ్బంది మస్తాన్, జక్రియ, సూరయ్య, ఉపాధ్యాయులు యాకయ్య, శ్యాంసుందర్ పాల్గొన్నారు.
హన్మకొండ : హరితహారం లో భాగంగా మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 31 వ డివిజన్ కార్పొరేటర రాజు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం రోజు మూడవ వ విడత భాగంగా ఎనిమిదవ రోజు మున్సిపల్ రెవెన్యూ స్పెషల్ ఆఫీసర్, అధికారులు అంగన్వాడీ టీచర్ల తో కలసి ఆయన కనకదుర్గమ్మ కాలనీ, వాసవి కాలనిలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. రోడ్ల మీద ముల్ల చెట్లను తొలగించి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటుతున్నా వాటిని రక్షించే బాధ్యత కొందరు తీసుకోవడం లేదని అన్నారు. తక్కువ మొక్కలు నాటి రక్షించే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్ యాదగిరిరావు రవీందర్ రావు దేవేందర్ రెడ్డి భద్రు నాయక్ సంతోష్ లయన్స్ క్లబ్ వాళ్లు మరియు నాగాబొయిన నాగబాబు పిండి కుమార్ వేల్పుల సాంబమూర్తి, ఆరునూరు లక్ష్మణ, గన్నారపు ప్రసాద్, ఎడ్ల కన్నయ్య, ఆరేళ్ల కిరణ్, వేల్పుల ప్రసాద్, నన్నెబోయిన రాజు, బొల్ల భిక్షపతి, సత్తు చిన్నన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
మహదేవపూర్ : మండలంలోని సూరారం గ్రామంలో గురువారం సర్పంచ్ నాగల లక్ష్మారెడ్డి హరితహారం లో భాగంగా ప్రతి ఇంటికి ఆరు ముక్కల చొప్పున పంపిణీ చేశారు. ప్రజలందరూ మొక్కలు సంరక్షించాలన్నారు. ఉప సర్పంచ్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.