Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు మొదటి విడతలో రూ.200కోట్లు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి తెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ మహిళ సంఘాలు తీసుకునే రుణాలకు వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని, ఆ వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కరోనా సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మహిళా సంఘాలను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నిధులు విడదల చేశారన్నారని అన్నారు. మహిళా సాధికారత ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సంఘాలకు గతంలో ఎన్నడు లేని విధంగా పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళా శక్తిని గుర్తించిన సీఎం కేసీఆర్ వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వడ్డీ లేని రుణాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.1698 కోట్లు కేటాయించారని అన్నారు. రాష్ట్రంలో గత ఏడేళ్ళ కాలంలో 44 వేల 270 కోట్ల రూపాయలను సెర్ప్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కల్పించామన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజీ గణనీయంగా పెరిగిందన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో లక్షా96వేల447 స్వయం సహాయక సంఘాలకు రూ.3739 కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించగా 2020-21లో 2,71,978 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.10వేల448 కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించినట్లు తెలిపారు.