Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్ జగదీశ్వర్, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
కరోనాతో మృతిచెందిన బాధిత ఉద్యోగ కుటుంబాలను ఆదుకుంటామని జెడ్పీ చైర్మెన్ జగదీశ్వర్, ఎమ్మెల్యే సీతక్క భరోసా ఇచ్చారు. కోవిడ్ బారినపడి జిల్లాలో మరణించిన ఉద్యోగ ఉపాధ్యాయుల స్మారకార్థం జిల్లా లోని ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్ ఆదర్శ్ సురభి, జెడ్పీ సీఈఓ ప్రసూన రాణి, ఏపీడీ రవి, జిల్లా విద్యాశాఖ ఆకడమిక్ మానిటరింగ్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ములుగు సర్పంచ్ నిర్మల హరినాధంతో కలిసి వారు పాల్గొని మరణించిన ఉద్యోగుల జ్ఞాపకార్థం మొక్కలు నాటారు .అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలోజగదీశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ జిల్లాలో మతిచెందిన ఉద్యోగ కుటుంబాలకు అండగా ఉంటానని, ప్రభుత్వం నుండి వచ్చే సహాయం, ఉద్యోగికి వచ్చే అన్ని బెనిఫిట్స్ సకాలంలో అందేలా కషి చేస్తానని హామీనిచ్చారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ మరణించిన ఉద్యోగులకు తన సంతాపాన్ని తెలిపారు. అనంతరం జెడ్పిసిఓ ప్రసూన రాణి మాట్లాడుతూ కోవిడ్ బారినపడి మతి చెందిన ప్రతి ఒక్క ఉద్యోగుల కుటుంబాలకు జెడ్పీ పరిధి నుండి వచ్చే బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు నాగేశ్వరరావు, శ్రీను, మధుసూదన్ నాగరాజు, విజరు కుమార్ సంజీవ, బాబురావు, రఘుపతి కుమార్ పాడియా, సరిత, ప్రేమ్‌కుమార్, వినీత్ రెడ్డి, పాల్గొన్నారు.