Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
దళితుల అభ్యున్నతే లక్ష్యమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో పల్లె ప్రగతి, హరితహారం చివరి దశకు చేరుకున్న సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో పల్లెప్రగతి పనులు దిగ్వి జయంగా పూర్తిస్థాయిలో జరిగాయన్నారు. నియోజ కవర్గ కేంద్రంలో ప్రతి వాడలో ముఖ్యంగా దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగు తున్నామని అన్నారు. నియోజకవర్గకేంద్రాన్ని సస్య శ్యామలం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మీదికొండ గ్రామానికి చెందిన గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి జోగు కుమార్ జన్మదినం సందర్భంగా ఎల్లయ్య, భాగ్యలక్ష్మి, సతీమణి వసంత- కుమార్, చిరంజీవి శ్రీమాన్‌తో సహా కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే సమక్షంలో కేక్ కట్ చేసి వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు తాటికొండ సురేష్ ,ఎంపీటీసీ గన్ను నర్సింహులు, గ్రామరైతు కోఆర్డినెటర్ కేశిరాజు నరహరి, మాజీ సర్పంచ్ నాగరబోయిన శ్రీరాములు, డైరెక్టర్ గట్టు మనోహర్, కొండం లక్ష్మణ్, ఆకుల శివశంకర్, మండల యూత్ అధ్యక్షుడు మారేపల్లి ప్రసాద్, పట్టణ యూత్ అధ్యక్షుడు గుండె మల్లేష్, శివ, పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి ఆకారపు అశోక్, తదితరులు పాల్గొన్నారు.