Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
పల్లె ప్రగతి అమలు లో రాష్ట్రానికి జనగామ జిల్లా ఆదర్శంగా ఉందని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం మండలంలోని గూడూరు గ్రామాన్ని డీఆర్డీఓ గూడూరు రామ్‌రెడ్డి, ఎంపీపీ నల్లా నాగిరెడ్డితో కలిసి ఆమె సంద ర్శించారు. పల్లె ప్రకతి వనం, డంపింగ్ యార్డు, నర్సరీ, స్మశాన వాటిక సెగ్రి గేషన్ షెడ్లను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పల్లె ప్రగతి లో పాలకుర్తి మండలం ఆదర్శంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. హరితహారం మొక్కల సంరక్షణకు ట్రి గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో రెండు పడకల ఇండ్లు మంజూరు చేసి, అర్హులైన నిరుపేదలకు కేటా యిస్తానన్నారు. వర్షాలకు ఇండ్లు కూలిపోయిన వారికి ఇండ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో 60 మందికి పైగా కళాకారులు ఉన్నట్లు, వీరికి ప్రభుత్వం నుండి ఎటువంటి పింఛను రావడం లేదని, మంజూరుకు కలెక్టర్ ను కోరారు. అర్హత మేరకు పింఛన్ల మంజూరుకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గూడూరు నుండి జానకిపురం వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. గ్రామంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఆమె అన్నారు. గ్రామంలో పారిశుధ్యం పకడ్బందీగా చేపట్టాలఆన్నరు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్ర త్తలు తీసుకోవాలని అన్నారు. రహదారులకిరువైపుల పెద్ద మొక్కలు నాటాలని, పడిపోయిన ట్రీ గార్డులను సరిచేయాలన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో వెంటనే కొత్త మొక్కలు నాటాలని అన్నారు. పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. పల్లె ప్రగతి అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి నూరొద్దీన్, ఎంపీడీవో వనపర్తి అశోక్‌కుమార్, సర్పంచ్ మంద కొమురయ్య, ఎంపీఓ దయాకర్, తదితరులు పాల్గొన్నారు.